షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ తో కలర్ ఫోటో సినిమా డైరెక్టర్ పెళ్లి..

షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ తో కలర్ ఫోటో సినిమా డైరెక్టర్ పెళ్లి..

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ సందీప్ రాజ్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పలు యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ లో హీరోయిన్ గా నటించిన చాందిని రావు అనే నటిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ఇరువురి పెళ్ళికి ఇటీవలే పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

దీంతో చాందినీ రావు, సందీప్ రాజ్ నవంబర్ 11న ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారని అలాగే డిశెంబర్ 7న తిరుమల తిరుపతి దేవస్థానం నందు ఇరువురి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకూ సందీప్ రాజ్ ప్రేమ వ్యవహారాన్ని సీక్రెట్ గా ఉంచారు. 

ALSO READ | మెగాస్టార్ విశ్వంభర నుంచి మీనాక్షి చౌదరి క్లారిటీ.. అవన్నీ తప్పుడు వార్తలంటూ..

ఈ విషయం ఇలా ఉండగా సందీప్ డైరెక్ట్ చేసిన కలర్ ఫోటో సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా ఇటు మ్యూజికల్ గా, అటు కమర్షియల్ గా మంచి హిట్ అయ్యింది. అంతేగాకుండా సందీప్ రాజ్ కి నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది.