కోళ్ళకూ భావోద్వేగాలుంటాయి.. మూడ్ను బట్టి ముఖం రంగు మారుస్తాయి

కోళ్లకు భావోద్వేగాలు ఎంటాయా? మనుషుల మాదిరిగానే భావోద్యేగం కలిగినప్పుడు వాటి ముఖంలో తేడా కనిపిస్తుందా? సాధారణంగా మనుషులకు బాధ కలిగిన ప్పుడు ముఖం ఎరుపుగా కనిపిస్తుంది.. ఈ విషయం మనకు తెలుసు. కానీ కోళ్లలో కూడా భావోద్వేగాలు ఉంటాయట..అవి కూడా బాధలో ఉన్నప్పుడు మొఖం ముదురు ఎరుపు రంగులోకి మారుతుందని ఓ పరిశోధన సంస్థ చేసిన సర్వేలో తేలింది. 

 INRAE పరిశోధనా బృందం చేసిన అధ్యయనం ఈ వాస్తవాన్ని ధృవీకరించింది. కోళ్ల ప్రవర్తనా  విధానాలను అర్థం చేసుకోవడానికి కొత్త మార్గాలను చూపింది. ఇతర జంతువులు, పక్షుల మాదిరిగానే కోళ్లు కూడా ఆనందం, ఉత్సాహం నుంచి విచారం, భయం వరకు భావోద్వేగాలను అనుభవిస్తాయి. కోడి విశ్రాంతి లేదా సంతోషంగా ఉన్నపుడు వాటి ముఖం రంగు లేత గులాబీ రంగులోకి మారుతుందట.

కోళ్ల భావోద్వేగాలకు అనుగుణంగా జరిగే రక్త ప్రసరణ కారణంగా ఇలా రంగులు మారుతాయట.  వాటి ముఖం చుట్టూ ఉన్న చర్మం చాలా సున్నితంగా ఉంటుంది.. ఈ మార్పులు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. 

కోళ్లు విచారం  లేదా భయాన్ని అనుభవించినప్పుడు ముఖంలోని రక్త ప్రసరణ పెరిగి ముఖం ముదురు  ఎరుపు రంగులోకి మారుతుంది. అదేవిధండగా అవి రిలాక్స్ మోడ్ లో ఉన్నపుడు రక్త  ప్రసరణ సాధారణంగా ఉండటంతో ముఖం లేత గులాబీ రంగులోకి మారుతుందని పరిశోధన బృందం సభ్యులు చెబుతున్నారు.

మూడు నెలల వయసున్న అనేక రకాల కోళ్లపై పరిశోధకులు పరిశీలించారు.  మూడు వారాల పాటు వాటిని పరిశీలించారు. వాటిలో ప్రతిచర్యలలో మార్పును గమనించడానికి తగిన ఆహారం ఇవ్వడం, వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించడం వంటి చేయడం ద్వారా వాటి భావోద్వేగాలను పరిశీలించారు. కోడి ప్రొఫైల్ ను గుర్తించడానికి ఫొటోలు తీశారు. కొన్ని ఇమేజరీ సాఫ్ట్ వేర్ సాయంతో పరిశోధకులు వాటి భావోద్వేగాలకు అనుగుణంగా వాటి ముఖ చర్మం ఎరుపు స్థాయిలను కొలిచారు. 

అంతిమంగా   INRAE పరిశోధనా బృందం చేసిన అధ్యయనంలో ఇతర జంతువులు, పక్షులకు మాదిరిగానే కోళ్లు కూడా ఆనందం, విచారం, ఉత్సాహం, భయం వంటి భావోద్వేగాలను కలిగి ఉంటాయని.. వాటి ముఖం రంగులు మారడాన్ని బట్టి నిర్దారించారు.