Holi 2025 : రంగ్ బర్సే జర జాగ్రత్తగా.. అన్ని మరకలు మంచిది కాదు..

Holi 2025 : రంగ్ బర్సే జర జాగ్రత్తగా.. అన్ని మరకలు మంచిది కాదు..

హోలీ వేడుకల్లో కెమీకల్ కలర్స్ స్కీన్ కి ప్రమాదం .. అలాగని ఆర్గానిక్ రంగులతో ఎక్కువసేపు ఉండటం కూడా మంచిదేం కాదు. ఈ పండుగ కోసం జుట్లు, చర్మం, బట్టలు ... ఇలా ప్రతీ విషయంలో జాగ్రత్తలు పాటించాలనుకుంటారు. చాలామంది. కానీ, నలుగురిలోకి వెళ్లి హోలీ ఆడేటప్పుడు అవేం గుర్తుకురావు. అందుకే...  ఆడేముందే కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించి తీరాలి..మరి హోలీ ఆడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..

నోరూరించే స్వీట్స్, మ్యూజిక్ కోలాహలంతో చిందులు.. మరీముఖ్యంగా రంగుల్లో మునిగితేలే 'హోలీ' పండుగ వచ్చేసింది. దేశం మొత్తం కులమతాలకతీతంగా జరిగే ఈ వేడుక అంతా ఒక్కటే అనే భావనని పెంపొందిస్తుంది. రంగులతో ఆడుకోవడం, రంగు నీళ్లలో తడిసి ముద్దయిపోవడం అందరికీ సరదాగానే ఉంటుంది. అదే టైంలో ఆడేముందు ఒక్కనిమిషం కేర్ తీసుకుంటే ఆనందంగానే కాదు.. ఆరోగ్యంగా కూడా రంగుల పండుగను ఆస్వాదించొచ్చు. 

ఆయిల్ పూత : హోలీ పూట జుట్టుని కాపాడుకోవడం అవసరం. అందుకే ముందురోజు రాత్రి జుట్టుకి కొబ్బరి నూనె రాసుకోవాలి. ఉదయం మరోసారి జుట్టుకి మళ్లీ నూనె రాయడం బెటర్. ఆడవాళ్లు జుట్టును ముడేయటం లేదా పోనీ టెయిల్ వేసుకోవడం బెటర్. రంగులు ఒంటికి పడితే ఒకపట్టాన వదలవు. పైగా పొడిబారిన చర్మం మీద పదే రంగులు చర్మరోగాలకు దారితీస్తాయి. కాబట్టి, ఆడేముందు రెండుసార్లు దట్టంగా మాయిశ్చరైజింగ్ లోషన్ రాసుకోవాలి. ఆలివ్​, కొబ్బరి నూనెలు మిశ్రమం పట్టిస్తే పొరలాగా అడ్డుకుంటాయి. చర్మాన్ని కాపాడుతాయి. పెట్రోలియం జెల్లీని కాళ్లు, చేతులకు రాసుకోవాలి వండుగపూట వేడి ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి సన్ స్క్రీన్ లోషన్ హోలీ అస్సలు మిస్ కాకూడదు. 

సాధారణంగా కొంతమంది కొబ్బరినూనె రాస్తారు. దానికి బదులు బేబీ అయిల్ రాసుకోవడం ఉత్తమం వాటర్ ప్రూఫ్ సన్ స్క్రీన్ లోషన్ రాసుకున్నా పర్వాలేదు. ఎన్​.పీ.ఎఫ్ ( నర్స్​ ఫ్రీ స్ర్కైబర్స్​ ఫార్ములరీ)30కి పైన ఉండే సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించాలి. వాటర్​ ప్రూఫ్​  ఇంకా బెటర్.  ఇది నీళ్లు వంటిమీద పడినా పోదు. పైగా దుమ్ము ...ఎండల నుంచి కూడా చర్మాన్ని రక్షిస్తుంది.


నో ఫేషియల్ : కనుబొమ్మలకు... రెప్పలకు బేబీ ఆయిల్ లైట్​గా రాయాలి. పెదాలకు లిప్​ బామ్​ పూయాలి. గోళ్లకు రంగులు అంటితే... పొడిబారి విరిగిపోతాయి. కాబట్టి ముదురు రంగులతో నెయిల్ పాలిష్ వేసుకోవాలి హోలీకి ముందు స్కిన్ ట్రీట్ మెంట్స్ చేయించుకోవద్దు. ఫేషియల్ వాక్సింగ్.... లాంటి వాటికి దూరంగా ఉండాలి. ఒకవేళ చేయించుకుంటే హోలీకి దూరంగా ఉండటమే మంచిది. హోలీ ఆడేముందు వీలైనంత మంచినీరు తాగడం వల్ల చర్మం లోపలినుంచి తేమగా ఉంటుంది.

మరక మంచిది కాదు... 

హోలీరోజు ఖరీదైన బట్టలు వేసుకోరు. తెలుపు రంగు చీఫ్​ బట్టలు వాడతారు. ఒక్కసారి వాడి పడేస్తారు. యూజ్ అండ్ త్రో కానప్పుడే జాగ్రత్త పడాలి.  హోలీ ఆడేటప్పుడు పాతబట్టలు వేసుకోవాలి అనుకుంటారే. కానీ... అవి రంగుల నుంచి ఏమేరకు అడ్డుగా నిలుస్తాయో పట్టించుకోము. 

ఒంటికి వీలైనంత కప్పి ఉండే(పుల్ స్లీప్ డ్రస్సులు) బట్టల్ని వేసుకోవడం మంచిది. దీనివల్ల చర్మానికి డ్యామేజ్ జరగకుండా కాపాడుకోవచ్చు. అవి కూడా కాటన్ వైతే మరీ మంచిది. ఎందుకంటే పాలిస్టర్ బట్టల మీద పడిన రంగులను అవి పీల్చుకోవు సరికదా.. వాటి మీద మరోసారి నీటిని కుమ్మరించగానే రంగులన్నీ మళ్లీ ఒంటి మీదకి జారతాయి. 

Also Read :- మార్చి 29న షష్ఠగ్రహ కూటమితోపాటు సూర్యగ్రహణం

హోలీ తర్వాత బట్టల్ని వేరువేరుగా ఉతకాలి తడిగా ఉంటే... తడి ఆరకుండానే ఉతకాలి. ఆక్సిజన్ బేస్ట్  బ్లీచ్​, నాన్​ క్లోరిన్​ బీచ్​ లో నానపెడితే మరకలైనా పోతాయి. ఉతకడం కోసం చల్లని నీటినే వాడాలి. చిన్నచిన్న మరకలైతే వైట్ వెనిగర్, డిటర్జెంట్ తో మరకపడిన చోట రుద్దితే పోతాయి 


క్విక్ బాత్ : హోలీ ఆడిన తరువాత చాలామంది అవే రంగులతో గంటల తరబడి కాలక్షేపం చేస్తుంటారు. కానీ వీలైనంత త్వరగా ఆ రంగులను వదిలించుకోవడమే మేలు. పైగా ఒంటినిండా రంగులతో ఎండలో కనుక తిరిగితే వాటిలోని రసాయనాలు చర్మానికి అంటుకుపోయే ప్రమాదం ఉంటుంది. 

కాబట్టి..  వీలైనంత త్వరగా స్నానం చేయడం ఉత్తమం.  హోలీ ముగిశాక చేసే స్నానం విషయంలో  కూడా జాగ్రత్తగా ఉండాలి.  ఒంటి మీద పడిన  రంగులను వెంటనే శుభ్రం చేసుకునేందుకు  చాలామంది పెట్రోల్, కిరసనాయిల్  వంటివి వాడతారు. వీటితో చర్మం మరింత  పొడిబారిపోతుంది. వీలైతే మామూలు సబ్బుతో  కాకుండా పిల్లల సబ్బుతో రుద్దుకోవడం మంచిది. 

స్నానం తర్వాత కూడా మరోసారి ఒంటికి మాయిశ్చరైజింగ్ లోషన్ పట్టిస్తే మరీ మంచిది. మైకా, సీసం రేణవులు మాడుని దెబ్బతీస్తాయి. అందుకే  షాంపు ఆపై చేయడానికి ముందు.. చాలా సేపు నీటితో జుట్టును కడగాలి. ఆపై సాఫ్ట్ షాంపోలతో స్నానం చేయాలి

జాగ్రత్త అవసరం : హోలీ రంగుల్లో కాపర్ సల్ఫేట్, మెర్క్యురీ, క్రోమియం... కెమికల్స్ వాడతారు. ఇవి నోట్లోకి వెళ్లినా, కంట్లో పడినా కూడా హాని జరుగుతుందని వేరే చెప్పనవసరం లేదు. అందుకనే కళ్లజోడు పెట్టుకుని హోలీ అడితే మంచిది. అలా కుదరని పక్షంలో కంట్లో ఏమైనా రంగులు పడినప్పుడు. వెంటనే వీలైనంత నీళ్లతో కంటిని కనుక్కోవాలి. శుభ్రం చేసుకున్నాక కూడా కళ్ళు మండుతున్నా, కళ్ల వెంబడి నీరు కారుతున్నా, మసకగా కనిపించినా.. వెంటనే డాక్టర్ని కన్సల్ట్ కావాల్సిందే. 

హోలీ ఆడుతున్నప్పుడు పిల్లల్ని పేరెంట్స్  కంటపెట్టాలి. వారు తేలిక పాటి  రంగులు వాడేలా చూసుకోవాలి, ఈ  రంగులను ముఖం పైన కాకుండా ఒంటికి  మాత్రమే అంటేలా ఆడుకోవాలని చెప్పాలి.  రంగులలో కెమికల్స్ కలపడం వల్ల  చర్మం పాడైపోవడం, కళ్లల్లో పడితే చూపు  పోయే ప్రమాదం కూడా ఉంది. రంగులు పూసుకునే క్రమంలో దెబ్బలు తగిలే  అవకాశం ఉంటుంది. కాబట్టి, జాగ్రత్త  చెప్పాలి. ఆడపిల్లల విషయంలో ఇంకా  అప్రమత్తంగా ఉండాలి. 

–వెలుగు,లైఫ్​–