ఇదే కరెక్ట్.. కొట్టినా.. తిట్టినా పడి ఉంటదిలే : బొమ్మను పెళ్లి చేసుకున్న యువకుడు..

ఇదే కరెక్ట్.. కొట్టినా.. తిట్టినా పడి ఉంటదిలే : బొమ్మను పెళ్లి చేసుకున్న యువకుడు..

పెళ్లి అనేది వధువు, వరుడ్ని మాత్రమే కాదు.. వారి కుటుంబాలను సైతం ఒక్కటి చేస్తుంది. ప్రపంచంలో చాలా మంది వివిధ సంప్రదాయాలు, ఆచారాల ప్రకారం వివాహాలు జరుపుకుంటారు. కొంత మంది ప్రేమ వివాహాన్ని ఎంచుకుంటే.. మరికొందరు మాత్రం పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకునేందుకు ఇష్టపడతారు. ఇంకొందరైతే వారితో కొన్నాళ్లు ఉండి, ఆ తర్వాత వాళ్లకు నచ్చితే పెళ్లి చేసుకుంటారు. అయితే ఈ వివాహం చేసుకునే విధానంలోనూ చాలా ప్రత్యేకతలు, సంప్రదాయాలు, విధానాలు ఉన్నాయి. కొందరు సాధారణ పద్దతిని ఎంచుకుంటే మరికొందరు చాలా గ్రాండ్ గా చేసుకునేందుకు మొగ్గు చూపిస్తారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మాత్రం ఇవేమీ కాకుండా ఓ వింత, విచిత్రమైన వివాహం గురించి.. అదేంటంటే..

కొలంబియాలో ఓ వ్యక్తి బొమ్మను పెళ్లి చేసుకున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. క్రిస్టియన్ మోంటెనెగ్రో అనే వ్యక్తి అప్పట్నుంచి ఆ బొమ్మనే తన భార్యగా చూసుకుంటున్నాడు. అతను ఆమెతో ఒక కుటుంబాన్ని కూడా స్థాపించాడు. అతను ముగ్గురు బొమ్మల పిల్లలను కూడా కలిగి ఉన్నాడు. అతను తన భార్య నటాలియాతో తరచుగా వివిధ ఫ్యామిలీ ఫంక్షన్స్, విహారయాత్రలకు కూడా వెళ్తుంటాడు. తన మాజీ ప్రేయసి వేరొకరి కోసం తనను వదిలి వెళ్లిపోయిందని, అందుకే తాను ఇలా బొమ్మను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు క్రిస్టియన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అలా తన మాజీ ప్రేయసితో విడిపోయిన తర్వాత తాను చాలా కాలం పాటు ఒంటరిగా ఉన్నానని, ఎవరితోనూ డేటింగ్ చేయలేదని చెప్పాడు. అలా చివరకు నటాలియా అనే రాగ్ డాల్‌తో డేటింగ్ ప్రారంభించానని, ప్రస్తుతం తాను ఆమెతో చాలా సంతోషంగా ఉన్నానని, దీని ద్వారా తన జీవితంలో ప్రేమను కనుగొన్నాడని చెప్పాడు.

ALSO READ :రైల్వే సిగ్నల్స్ ఫెయిల్.. గజిబిజీ గందరగోళం అయిన లోకల్ రైళ్లు

ఈ విషయంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు అతనికి మద్దతుగా ఉండగా, మరికొందరు క్రిస్టియన్‌ను ట్రోల్ చేశారు. అతను మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడని ఆరోపించారు. అతను మానసిక రుగ్మతతో బాధపడలేదని వైద్య నిపుణులు స్పష్టం చేశారు, అయితే ఆబ్జెక్టోఫిలియా అని పిలువబడే లైంగిక ప్రాధాన్యత ఉండే ప్రత్యేక రూపాన్ని మాత్రం కలిగి ఉన్నాడని, దీని వల్ల ఒక వ్యక్తి ఒక వస్తువు పట్ల లైంగికంగా లేదా మానసికంగా ఆకర్షితుడవుతారని సమాచారం.

ఇటీవల, నటాలియా అనారోగ్యానికి గురైంది. క్రిస్టియన్ ఆమెకు చికిత్స చేయడానికి పారామెడిక్స్‌ను పిలుస్తున్నట్లు చూపించే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో, ఆమె స్ట్రెచర్‌తో ఆసుపత్రికి తీసుకెళ్లడం కనిపించింది. ఇది చిలిపి పనా లేక క్రిస్టియన్ నిజంగానే ఆందోళన చెందాడా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.