ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిర్మల్ : తెలంగాణ విమోచన చరిత్రను సీఎం కేసీఆర్ వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. విషయాన్ని ప్రజలకు వివరించడం కోసమే బీజేపీ కృషిచేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి చెప్పారు. బీజేవైఎం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక బీజేపీ ఆఫీస్​ వెయ్యి ఉరుల మర్రి అమరవీరుల స్తూపం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రమాదేవి మాట్లాడుతూ బీజేపీ ఆధ్వర్యంలో 17న పెద్ద ఎత్తున విమోచన దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ పెద్దపల్లి ఇన్​చార్జి రావుల రాంనాథ్, అయ్యన్నగారి భూమయ్య, అర్జున్, శ్రావణ్, వెంకటేశ్, కమల్ నయన్, శ్రావణ్ రెడ్డి, శ్రీనివాస్, విజయ్, సుధాకర్​ తదితరులు పాల్గొన్నారు.

భైంసాలో...
భైంసా, వెలుగు: భైంసాలో బీజేపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ తీశారు. పార్టీ సీనియర్​లీడర్లు నారాయణ్​ రెడ్డి, గంగారెడ్డి, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో  ఈ కార్యక్రమం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఎంఐఎంకు భయపడే తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించడంలేదని నాయకులు ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు తాలోడ్​ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు బాలాజీ సూత్రావే తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధిని పట్టించుకుంటలేరు...
రామకృష్ణాపూర్,వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కారణంగా రామకృష్ణాపూర్​ అభివృద్ధికి నోచుకోలేదని టీడీపీ పార్లమెంట్ ప్రెసిడెంట్ బి.సంజయ్​ కుమార్​ విమర్శించారు. బుధవారం ఆయన స్థానికంగా మీడియాతో మాట్లాడారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పేరును రామకృష్ణాపూర్ గా మార్చితే  అభివృద్ధి జరిగినట్లు కాదన్నారు. మున్సిపాలిటీ బోర్డు మారడం తప్ప ప్రజలకు కొత్తగా ఒరిగేది ఏమీలేదన్నారు. రామకృష్ణాపూర్ మండలం కాకపోవడానికి సుమన్, ఓదెలు నిర్లక్ష్యమే కారణమన్నారు. క్యాతన్ పల్లి రైల్వే గేటు వద్ద ఏడేళ్లు గడిచినా ఫ్లైఓవర్ పూర్తికాలేదన్నారు. ఆర్కేపీలో వరుసగా బొగ్గు గనులు మూతపడుతున్నాయని, కొత్త గనుల కోసం ప్రయత్నాలు జరగడంలేదన్నారు. స్థానిక స్టూడెంట్ల కోసం ఐటీఐ, జూనియర్, డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయాలని డిమాండ్​చేశారు. సింగరేణి కార్మికేతర కుటుంబాలు వేలాది నివాసముంటున్న రామకృష్ణాపూర్​లో 35 బెడ్స్​ ప్రభుత్వ ఆసుపత్రి, స్థానిక యువతకు ఉపాధికి పరిశ్రమల ఏర్పాటుకు కృషిచేయాలన్నారు. రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నా.. ఎమ్మెల్యే, టీఆర్ఎస్​లీడర్లు పట్టించుకోవడంలేదన్నారు. సమావేశంలో పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఇందారపు రాములు, వైస్ ప్రెసిడెంట్​ ఎండీ జలీల్, మండల కన్వీనర్ రాజేశ్వర్​రావు, గిర్నాల శ్రీనివాస్, లింగమ్మ  పాల్గొన్నారు. 

30 నుంచి సౌత్ ఇండియా కరాటే పోటీలు 
మంచిర్యాల : అంజనీపుత్ర ఎస్టేట్​ సహకారంతో సీసీసీ టౌన్ షిప్​లోని ఎంఎం గార్డెన్​లో ఈనెల 30 నుంచి  సౌత్ ఇండియా కరాటే పోటీలను నిర్వహించనున్నట్టు టోర్నమెంట్​ చైర్మన్​ గుర్రాల శ్రీధర్​ తెలిపారు. టోర్నమెంట్ పోస్టర్లను బుధవారం రామగుండం పోలీస్​ కమిషనర్​ ఎస్​.చంద్రశేఖర్​రెడ్డి ఆవిష్కరించారు. ఈ పోటీలకు ఆరు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు, ప్రముఖులు, సినీ హీరో సుమన్ హాజరు కానున్నారని తెలిపారు. కరాటేతో ఆత్మవిశ్వాసం, మానసిక స్థైర్యం పెంపొందుతుందని అన్నారు. ఈ పోటీలను విజయవంతం చేయాలని సీపీ చంద్రశేఖర్​రెడ్డి కోరారు. కార్యక్రమంలో అంజనీపుత్ర ఎస్టేట్స్ డైరెక్టర్ పిల్లి రవి, నిర్వాహకులు మాటురి శివ, మహేష్, వెంకటేశ్, ఆల్ స్టైల్స్ మార్షల్ ఆర్ట్స్ ప్రెసిడెంట్ మోహన్, కోశాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.  

ప్రభుత్వ పథకాలకు సింగరేణి పైసలు
నస్పూర్ : సింగరేణి డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమపథకాల కోసం వాడుకుంటుందని ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. దీంతో సంస్థ లాభాలు తక్కువ చూపించే ప్రయత్నాలు చేస్తోందన్నారు. బుధవారం  ఏరియాలోని ఆర్కే7గనిపై బ్రాంచ్ కార్యదర్శి కొట్టే కిషన్ రావు ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదు నెలలు గడిచినా.. ఇప్పటి వరకు లాభాలు ప్రకటించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే లాభాలు ప్రకటించి 35 శాతం వాటా కార్మికులకు ఇవ్వాలన్నారు.  కోయగూడెం ఓసీ3ని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రత్యక్ష పోరాటాలకు రెడీ అవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో లీడర్లు వీరభద్రయ్య, చంద్రశేఖర్, రాజేందర్, రవీందర్, సదానందం, బి.రవీందర్, మరపెల్లి సారయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న కాంట్రాక్ట్​ కార్మికుల సమ్మె
మందమర్రి : సింగరేణి కాంట్రాక్ట్​ కార్మికుల సమస్యలు పరిష్కారించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని కాంట్రాక్ట్​ కార్మిక సంఘాల జేఏసీ లీడర్లు ఆరోపించారు. బుధవారం మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల్లో కార్మికులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి సంస్థల దిష్టిబొమ్మలు దహనం చేశారు. మందమర్రిలో నిర్వహించిన ఆందోళనలో లీడర్లు ఎండీ జాఫర్, దూలం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లిలో ఐఎఫ్ టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ చాంద్​పాషా, టీఎన్ టీయూసీ రాష్ట్ర నాయకుడు టి. మనిరామ్ సింగ్, ఎస్ జీకేఎస్ కన్వీనర్ ఎ. మహేందర్  పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలకు సింగరేణి పైసలు
నస్పూర్ : సింగరేణి డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమపథకాల కోసం వాడుకుంటుందని ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. దీంతో సంస్థ లాభాలు తక్కువ చూపించే ప్రయత్నాలు చేస్తోందన్నారు. బుధవారం  ఏరియాలోని ఆర్కే7గనిపై బ్రాంచ్ కార్యదర్శి కొట్టే కిషన్ రావు ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదు నెలలు గడిచినా.. ఇప్పటి వరకు లాభాలు ప్రకటించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే లాభాలు ప్రకటించి 35 శాతం వాటా కార్మికులకు ఇవ్వాలన్నారు.  కోయగూడెం ఓసీ3ని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రత్యక్ష పోరాటాలకు రెడీ అవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో లీడర్లు వీరభద్రయ్య, చంద్రశేఖర్, రాజేందర్, రవీందర్, సదానందం, బి.రవీందర్, మరపెల్లి సారయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి
ఆదిలాబాద్ టౌన్ : యువత ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ సూచించారు. బుధవారం గిరిజన సంక్షేమ గురుకుల కాలేజీలో ఇంటర్మీడియెట్ విద్యార్థులకు హెచ్​సీఎల్  టెక్​ బీ సంస్థ వారు నిర్వహించిన సాఫ్ట్​వేర్​ మెగా జాబ్​ మేళాను కలెక్టర్​ ప్రారంభించారు. కార్యక్రమంలో డీఐఓ రవీందర్​, హెసీఎల్​ సిబ్బంది, ఆర్​సీవో  పాల్గొన్నారు.

ఆసిఫాబాద్​, జైనూర్​లో బీజేపీ బైక్​ ర్యాలీ
ఆసిఫాబాద్​/జైనూర్ : బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం ఆసిఫాబాద్, ​జైనూర్​లో బైక్​ర్యాలీ నిర్వహించారు. అంతక ముందు లీడర్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫొటోకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్  మాట్లాడారు. ఆపరేషన్ పోలో ప్రారంభమైన ఐదురోజులకే నిజాం పాలకులు తలవంచారని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్నాక విజయ్​కుమార్, జైనూర్, సిర్పూర్ (యు) మండలాల పార్టీ అధ్యక్షులు దౌలత్ రావు, గేడం శంభు, పార్టీ లీడర్ ​బోనగిరి సతీశ్​బాబు పాల్గొన్నారు.

సొంత ఖర్చులతో గుంతల  పూడ్చివేత
చెన్నూరు : ప్రజలు  పడుతున్న ఇబ్బందులను  గుర్తించి రోడ్డుపై గుంతలను జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి సొంత ఖర్చులతో పూడ్చివేయించారు. ఇటీవల కురిసిన భారీ  వర్షాలకు నేషనల్ హైవే 63పై  చెన్నూరు మండలం చింతలపల్లి బతుకమ్మ వాగు  బ్రిడ్జి వద్ద అప్రోచ్ రోడ్డు తెగిపోయింది. దీంతో చెన్నూరు, కోటపల్లి, సిరొంచ పైపు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయంగా పాత రోడ్డు అయిన శివలింగపూర్ నుంచి చింతపల్లి వెళ్లే దారి గుంతలమయం కావడంతో స్పందించిన జడ్పి వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి తన సొంత  ఖర్చులతో రోడ్డుపై గుంతలను జేసీబీతో పూడ్చి వేయించారు.  గా రోడ్డును రిపేర్లు చేయించిన రాజిరెడ్డిని స్థానికులు అభినందించారు.

ఖానాపూర్​లో..
ఖానాపూర్ : ఖానాపూర్ మండల పరిషత్​కో ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ మాజీద్ మధురానగర్ కాలనీకి రూ. 35 వేలు సొంత డబ్బును ఖర్చు చేసి రోడ్డు వేయించాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కాలనీలోని రోడ్డు పూర్తిగా కోతకు గురికావడంతో స్పందించి ఆయన రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. 

అవార్డు గ్రహీతకు ముస్లింల సన్మానం
రామకృష్ణాపూర్ : గురుబ్రహ్మ జాతీయ అవార్డు గ్రహీత రామకృష్ణాపూర్​కు చెందిన తవక్కల్ విద్యా సంస్థల అధినేత అబ్దుల్ అజీజ్​ను బుధవారం ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కమిటీ బాధ్యులు ఎండీ పాషా, ఆరీఫ్, డాక్టర్ సలీం,  ఖాజా, మేరాజ్, ఇమ్రాన్, గౌస్, తాజ్, తాహెర్, నౌరొద్దీన్, హాఫిజ్ అజిజ్, అరఫత్  పాల్గొన్నారు.