నస్పూర్,వెలుగు: ప్రధాని నరేంద్రమోడీ ఫొటోకు ఆదివారం నస్పూర్ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. స్థానిక సీసీసీ కార్నర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు అగల్ డ్యూటీ రాజు, బీఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు బరపటి మారుతి మాట్లాడారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తున్నారని కార్మిక సంఘాలు, లీడర్లు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దన్నారు. వామపక్ష పార్టీల యూనియన్లు అభివృద్ధి, కార్మికుల హక్కుల కోసం పోరాడాలని.. అనవసరంగా కార్మికులను తప్పుదోవ పట్టించొద్దన్నారు. పెద్దపల్లి మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి కృషితోనే రామగుండం ఎరువుల కర్మాగారం తెరుచుకుందని లీడర్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జీవీ ఆనంద్, పానుగంటి మధు, సత్రం రమేశ్, సామ్రాజ్ రమేశ్, సిరికొండ రాజు, కొండా వెంకటేశ్, మైనార్టీ లీడర్పాషా, బుద్దే రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
జేపీఎల్ విజేతకు బహుమతులు అందజేత
ఆదిలాబాద్,వెలుగు: జైనథ్ లక్ష్మీనారాయణ స్వామి జాతర సందర్భంగా నిర్వహించిన జేపీఎల్ 3 క్రికెట్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఆదివారం బీజేపీ అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి, అడ సర్పంచ్ పాయల్ శరత్ బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి రూ. 20 వేల నగదును బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, రెండో బహుమతి రూ.15 వేల నగదును లోక ప్రవీణ్ రెడ్డి, మూడో బహుమతి రూ. 10 వేల నగదును జైనథ్ ఉప సర్పంచ్ అందజేశారు.
వెల్మ సంఘం ఆధ్వర్యంలో కార్తీక భోజనాలు
నిర్మల్,వెలుగు: పద్మనాయక వెల్మ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్మల్‌లో కార్తీక వన భోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఉసిరి, కృష్ణ తులసి చెట్లకు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంఘం అధ్యడు శ్రీధర్‌రావు, ప్రధాన కార్యదర్శి భాస్కరరావు మాట్లాడారు. అందరి సహకారంతో సంఘ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. స్నేహభావం పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. అంతకుముందు చదువులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సంఘ బాధ్యులు చంద్రశేఖర రావు, అనంత విశ్వేశ్వరరావు, తిరుమల్ రావు, శ్రీనివాసరావు, రాజశేఖర్ రావు, ప్రమోద్ రావు, జగన్మోహన్ రావు, కిషన్ రావు, సాగర్ రావు, సురేందర్‌రావు, సాయన్ రావు తదితరులు పాల్గొన్నారు.
గౌడ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
జన్నారం,వెలుగు: జన్నారం మండల గౌడ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నకున్నారు. స్థానిక పీఆర్టీయూ భవన్లో జరిగిన ఎన్నికల్లో సంఘం గౌరవ అధ్యక్షులుగా కాసారపు పోచాగౌడ్, పరకాల తిరుపతి గౌడ్, మండల ప్రెసిడెంట్ గా మూల భాస్కర్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్లుగా తిరుమల అంజాగౌడ్, పోడేటి మల్లేశ్ గౌడ్, తనుగుల భూమగౌడ్, మూల నారాయణగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పోడేటి నరేశ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శిగా పోడేటి రమేశ్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా బురగడ్డ నరేశ్ గౌడ్, రాసమల్ల పాపాగౌడ్, పోడేటి రామాగౌడ్, తనుగుల చిన్నాగౌడ్, పోతుగంటి రమేశ్‌గౌడ్, ట్రెజరర్‌గా అమరగొండ సతీశ్‌గౌడ్, ముఖ్య సలహాదారులుగా ఎనుగంటి సతీశ్ గౌడ్, కైరం భీమాగౌడ్, గాజుల లింగాగౌడ్, రాసమల్ల శంకర్ గౌడ్, తనుగుల రాజాగౌడ్ఎన్నికయ్యారు. అనంతరం సంఘ సభ్యులు మండల కేంద్రంలోని అంబేద్కర్, తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్, సర్వాయి పాపన్న విగ్రహాలకు పూల మాల వేసి నివాళి అర్పించారు.
ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలి
నస్పూర్,వెలుగు: ఎస్సీ రిజర్వేషన్లు 30 శాతానికి పెంచాలని మాల మహానాడు లీడర్లు కోరారు. ఆదివారం సీసీసీ నస్పూర్ లో మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసర్ల యాదగిరి మాట్లాడారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేన్లను సమర్దిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం బాధాకరమన్నారు. రాజ్యంగా నిర్మాత అంబేద్కర్ ఆశయాలు నెరవేరడం లేదన్నారు. అగ్రవర్ణ పార్టీలు పాలకులు కొత్తనాటకానికి తెరలేపి ఆర్థికపరమైన రిజర్వేష్లను తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేయడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సమావేశంలో లీడర్లు సాగర్, కోల సమ్మయ్య, కోల సరోజిని, బోడ పావని, బాదే కావ్య తదితరులు పాల్గొన్నారు.
200 మందికి అన్నదానం
బెల్లంపల్లి,వెలుగు: బెల్లంపల్లి కాంటాచౌరస్తాలో ఆదివారం అమ్మఒడి ఎన్ జీవో, అన్నదాత ప్రాజెక్టు, టెక్నో డ్యాన్స్అకాడమీ ఆధ్వర్యంలో 200 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా అమ్మ ఒడి అన్నదాత బ్రాంచి మేనేజర్, టెక్నో డ్యాన్స్అకాడమీ గ్రాండ్ మాస్టర్ హనుమాండ్ల మధూకర్ మాట్లాడారు. తనుగుల క్రాంతి కుమార్, -సుమలతల సహకారంతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ప్రతీ ఆదివారం అన్నదానం చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో హనుమాండ్ల సువర్ణ, గన్నేవరం తిరుమల చారి, రంగ సురేశ్, బియ్యాల ఉపేందర్, మేదరి రవి, సిద్దమళ్ల రఘు తదితరులు పాల్గొన్నారు.