ఖానాపూర్,వెలుగు: ఖానాపూర్ మండలం మస్కాన్పూర్, సుర్జాపూర్ గ్రామాల శివారులోని నల్ల పోచమ్మ ఆలయంలో సోమవారం మాజీ ఎంపీ, బీజేపీ లీడర్రాథోడ్ రమేశ్, పెంబి జడ్పీటీసీ భూక్యా జాను బాయి పూజలు నిర్వహించారు. అనంతరం ఈనెల 16 న జరగనున్న ఆలయ ప్రథమ వార్షకోత్సవానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, లీడర్లు బుచ్చన్న యాదవ్, ఆకుల శ్రీనివాస్, దాదే మల్లయ్య, సందుపట్ల శ్రావణ్, నాయిని సంతోష్, ఉపేందర్, గోపాల్ రెడ్డి, అనిల్ రావు, ఆనంద్, మనోజ్, భూమాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని మోడీ ఫొటోకు క్షీరాభిషేకం
మందమర్రి,వెలుగు: సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేయబోమని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడంతో బీజేపీ లీడర్లు సంబరాలు నిర్వహించారు. సోమవారం మందమర్రి మండలం ఆదిల్ పేటలో పార్టీ మండల ప్రెసిడెంట్పైడిమల్ల నర్సింగ్, జనరల్ సెక్రటరీ వంజరి వెంకటేశ్ ఆధ్వర్యంలో ప్రధాని ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. మూతపడ్డ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి చొరవచూపి ప్రారంభానికి కృషిచేశారన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం మండల ప్రెసిడెంట్ పెంచాల రంజిత్, ఆదిల్‌పేట, మామిడిగట్టు, పొన్నారం, సండ్రోనిపల్లి గ్రామ ప్రెసిడెంట్లు వేల్పుల మారుతి, సుంకరి రాజేందర్, బొర్లకుంట లక్ష్మణ్, పల్లపవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
నిర్మల్,వెలుగు: రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. సోమవారం స్థానిక పింజారి గుట్ట వద్దగల ఉదాసి మఠం భవనాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం పురాతన ఆలయాల గుర్తించి పూర్వవైభవం తెస్తోందన్నారు. బుధవారపేటలోని శివకోటి మందిరం, బంగల్ పేటలోని మహాలక్ష్మి ఆలయాలను రూ. 6 కోట్లతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. వచ్చేనెలలో మహాలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని ప్రారంభిస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ దేవాలయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడాలేవన్నారు. బంగల్‌పేట మహాలక్ష్మి ఆలయ ప్రారంభోత్సవ ప్రచార పోస్టర్ ను మంత్రి రిలీజ్చేశారు. గడువులోగా ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేసిన ఆలయ కమిటీ చైర్మన్ కొడుకల గంగాధర్, సభ్యులను, అధికారులను అభినం దించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రబోతు రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, ఎఫ్ఎస్ సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, మహాలక్ష్మి ఆలయ కమిటీ చైర్మన్ కొడకల గంగా ధర్, కౌన్సిలర్లు బిట్లుంగు నవీన్, ఎడపల్లి నరేందర్, సముందర్ పల్లి రాజు, కోఆప్షన్ సభ్యుడు చిలుక గోవర్ధన్, డి. శ్రీనివాస్, మరుకొండ రాము, ముడుసు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
స్వగృహ ప్లాట్ల వేలానికి భారీ స్పందన
-
గజానికి రూ.15,200 పలికిన ధర
-
రాత్రి వరకు కొనసాగిన వేలం పాట
ఆదిలాబాద్,వెలుగు: ఆదిలాబాద్ పట్టణంలని జానర్దన్ రెడ్డి గార్డెన్ లో సోమవారం నిర్వహించిన రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి భారీ స్పందన వచ్చింది. అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు. మొదటి రోజు 73 ప్లాట్లు వేలం వేయాల్సి ఉండగా, రాత్రి వరకు కేవలం 27 ప్లాట్లకు మాత్రమే వేలం వేశారు. పెద్ద ఎత్తున దరఖాస్తులు రావాడంతో సర్కార్ కు భారీగా ఆదాయం సమకూరింది. మొదటి రోజు అత్యధికంగా గజానికి రూ.15,200 ధర పలికింది. ప్రభుత్వం నిర్దేశించిన గజానికి రూ.8 వేల నుంచి వేలం పాట ప్రారంభం కాగా.. మొదటి నుంచి రూ. 12 వేలకు మించి ధర పలికింది. కార్యక్రమంలో ఆర్డీవో రమేశ్ రాథోడ్, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ మహేశ్వర్, మున్సిపల్ కమిషనర్ శైలజ, ఇండిస్ట్రియల్ జనరల్ మేనేజర్ పద్మభూషణ్ రాజు, తహసీల్దార్లు వనజారెడ్డి, సతీశ్, సంధ్యరాణి, హౌజింగ్ పీడీ బసవేశ్వర్, ఏవో రాజేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
రాజీవ్ స్వగృహ భూములు పేదలకు పంచాలి
ఆదిలాబాద్, వెలుగు: రాజీవ్ స్వగృహ భూములను పేదలకు పంచాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్‌శంకర్ డిమాండ్ చేశారు. ప్లాట్ల వేలాన్ని నిరసిస్తూ సోమవారం మహా ధర్నాకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా మార్చిన స్థలానికి బయల్దేరిన పాయల్ శంకర్‌ను ఆయన ఇంటి వద్ద గృహ నిర్బంధం చేశారు. మహిళలు, కార్యకర్తలను బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం జరగింది. ఈ సందర్భంగా పాయల్శంకర్మాట్లాడుతూ పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు భూములు లేవని చెబుతున్న సర్కార్.. రాజీవ్ స్వగృహ పేరిట రియల్ దందా చేయడానికి భూములు ఎలా వచ్చాయని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న ఎన్నికల మేనిఫెస్టోలో పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, నిరుద్యోగులకు భృతి ఇప్పిస్తామని ఆశచూపి, ఇప్పుడు ప్రభుత్వ భూలను ప్లాట్లుగా చేయించి వేలం పాటలో అమ్మేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలాన్ని ఆపేందుకు హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో లీడర్లు వేణుగోపాల్, ఆకుల ప్రవీణ్, జోగు రవి, దినేశ్మాటోలియా, వేదవ్యాస్, భీమ్‌సేన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి ప్రైవేటీకరణ ప్రచారాన్ని నమ్మొద్దు
నస్పూర్, వెలుగు: సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య సూచించారు. సోమవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పీ 3వ గనిపై ఏరియా ఉపాధ్యక్షుడు బరపటి మారుతి ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడానికి పార్టీలు, కొన్ని కార్మిక సంఘాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటివరకు 11 గనులు మూసివేసిందన్నారు. 62 వేల మంది కార్మికులకు గాను 42 వేల మంది కార్మికులే ఉన్నారన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య పెంచింది రాష్ట్ర ప్రభుత్వం కాదా? అని ఆయన ప్రశ్నించారు. సింగరేణిలో ప్రైవేటీకరణ ప్రోత్సహిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వమేనని మండిపడ్డారు. లీడర్లు రమేశ్, శ్రీధర్ రెడ్డి, బొంపెళ్లి రమేశ్, తిరుపతి పాల్గొన్నారు.