ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

    బీజేపీ రైతు ధర్నాలో రఘునాథ్​రావు 
    లక్ష రుణమాఫీ చేయాలని, ధరణి పోర్టల్​ రద్దు చేయాలని డిమాండ్​

మంచిర్యాల, వెలుగు: సీఎం కేసీఆర్​ రైతులకు రూ. లక్ష వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి మోసం చేశాడని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసగా గురువారం మంచిర్యాల ఐబీ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ధరణి పోర్టల్​ను రద్దు చేయాలని, రైతు రుణమాఫీ చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో తరుగు లేకుండా వడ్లను కొనుగోలు చేసి రసీదు ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

ప్రతి బస్తాకు మూడు నుంచి నాలుగు కిలోల వడ్లను తరుగు పేరిట దోచుకుంటున్నారని అన్నారు. రైతుకు రసీదులు కూడా ఇవ్వడం లేదన్నారు. గత ఎన్నికల సందర్భంగా రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి నాలుగేండ్లు అవుతున్నా చేయలేదన్నారు. రాష్ట్రంలో ఉన్న విలువైన భూములను పెత్తందారులకు తిరిగి అప్పజెప్పడానికే ప్రభుత్వం ధరణి పోర్టల్​ను తీసుకొచ్చిందని ఆరోపించారు. ధరణి లోపాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి, యూరియాపై సబ్సిడీ, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పంటలకు మద్దతు ధర పెంపు వంటి పథకాలతో రైతులకు మేలు చేస్తుంటే రాష్ర్ట ప్రభుత్వం అందుకు విరుద్ధంగా రైతులకు నష్టం చేస్తోందని మండిపడ్డారు. ధర్నాలో జిల్లా ప్రధాన కార్యదర్శులు రజినీష్ జైన్, అందుగుల శ్రీనివాస్, మునిమంద రమేష్, నాయకులు పొనుగోటి రంగరావు, పెద్దపెల్లి పురుషోత్తం, మున్నరాజ్​ సిసోడియా, పానుగంటి మధు, ఆనంద్​కృష్ణ, కొయ్యాల ఏమాజీ, మాధవరపు వెంకటరమణారావు, పత్తి శ్రీనివాస్ పాల్గొన్నారు.

న్యాయం కోసం డీఈ భార్య ఆందోళన

నిర్మల్,వెలుగు: నిర్మల్ జిల్లా మిషన్ భగీరథ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఓ డిప్యూటీ ఇంజినీర్ భార్య న్యాయ పోరాటానికి దిగిం ది. తన భర్త మరో ఇద్దరు మహిళలతో సహజీవనం చేస్తున్నాడని ఆరోపిస్తూ తన కొడుకుతో కలిసి ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ ఆమె గురువారం నిర్మల్ భగీరథ కార్యాలయం ముందు బైఠాయించింది. సిరిసిల్ల జిల్లా విలాసాగర్ గ్రామానికి చెందిన మానాల పూర్ణిమకు 2016లో కరీంనగర్ జిల్లా ఉప్పర మల్యాల గ్రామానికి చెందిన మానాల వినోద్ బాబుతో వివాహం అయ్యింది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. బాబు పుట్టిన మూడు నెలల తర్వాత మిషన్ భగీరథలో తన భర్త వినోద్ బాబుకు ఏఈగా ఉద్యోగం వచ్చినట్లు తెలిపింది. అనంతరం డీఈగా పదోన్నతి లభించినట్లు వివరించింది.

అప్పటి నుంచి తనను పట్టించు కోకుండా ఆరేళ్ల తర్వాత జగిత్యాల జిల్లా శ్రీరాముల పల్లె గ్రామానికి చెందిన బండపల్లి శిరీషను పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. మరో యువతితో సైతం సహజీవనం చేస్తున్నాడని  ఆరోపించింది. తాను గతంలో పోలీస్ స్టేషన్​తో పాటు పాటు బంధువులు, గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేసినా.. ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేసింది. పోలీసులు డీఈ వినోద్ బాబును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మెరుగైన వేతన ఒప్పందం కోసం పోరాటం

నస్పూర్,వెలుగు: బొగ్గుగని కార్మికుల మెరుగైన వేతన ఒప్పందం బీఎంఎస్ తోనే సాధ్యమని యూనియన్​ స్టేట్ ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య తెలిపారు. గురువారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ-3 గనిపై సింగరేణి కోల్​మైన్స్ కార్మిక సంఘ్​(బీఎంఎస్​) ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్​మీటింగ్​లో ఆయన మాట్లాడారు. వేజ్​బోర్డు​ అగ్రిమెంట్​జాప్యంపై బీఎంఎస్​ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వేజ్​బోర్డు చర్చల్లో  ఫిట్ మెంట్ బెనిఫిట్ 50 శాతం  ఇవ్వాలని డిమాండ్​చేస్తున్నట్లు వెల్లడించారు.

గత జేబీసీసీఐ సమావేశంలో 11వ వేతన ఒప్పందంలో 28 శాతానికి తగ్గకుండా పెంచాలని డిమాండ్‌‌‌‌ చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ ఏరియా సెక్రటరీ నాతాడి శ్రీధర్​రెడ్డి, లీడర్లు పెండ్లి మోహన్ రెడ్డి, కాసెట్టి నాగేశ్వరరావు, కాదాసి భీమయ్య, గాజుల వెంకటస్వామి, మాదాసు రవీందర్, పొడిసెట్టి వినోద్ కుమార్, బొంపెల్లి రమేశ్, మేకల స్వామి, పాగిడి శ్రీకాంత్, కాంపెల్లి తిరుపతి, కొండగొర్ల పీరయ్య, చల్ల ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బొగ్గుబ్లాక్​ల వేలం బిల్లును ఎందుకు అడ్డుకోలేదు

మందమర్రి​,వెలుగు: సింగరేణి ప్రైవేటీకరణ అంశంలో బీఆర్ఎస్ రెండు నాలుకల ధోరణి అవలంబిస్తూ కార్మికులను మోసం చేస్తోందని ఐఎన్టీయూసీ సెంట్రల్​సీనియర్ వైస్​ ప్రెసిడెంట్ సిద్దంశెట్టి రాజమౌళి అన్నారు. గురువారం మందమర్రిలోని ఐఎన్టీయూసీ ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్, టీబీజీకేఎస్ లీడర్లు మాయమాటలు చెబుతూ సింగరేణి కార్మికులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. కమర్షియల్ మైన్స్​పేరుతో  గనులను కేంద్రం ఎంఎంటీఆర్ యాక్ట్​ తెచ్చి దేశంలోని బొగ్గు బ్లాక్​లను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతుందన్నారు.

తెలంగాణలో ఉన్న నాలుగు బ్లాక్​లు సింగరేణికి కేటాయించాలని ఇంతవరకు రాష్ట్రం కోరలేదన్నారు. కేవలం ప్రకటనల ద్వారా ప్రైవేటీకరణ వ్యతిరేకమని బీఆర్ఎస్, టీబీజీకేఎస్​ప్రచారం చేస్తున్నాయి తప్ప.. ఎక్కడ కూడా ఆచరణలో కనిపించడంలేదన్నారు. సమావేశంలో కేంద్ర కమిటీ జనరల్ సెక్రటరీ కాంపెల్లి సమ్మయ్య, ఏరియా వైస్​ ప్రెసిడెంట్ దేవీ భూమయ్య , ఆర్కేపీ వైస్  ప్రెసిడెంట్ రాంబాబు, ఏరియా సెక్రటరీలు కె.ఓదెలు, దొరిసెట్టి చంద్రశేఖర్, బత్తుల వేణు, లీడర్లు ఎండీ విక్రమొద్దీన్, ఈద యాదగిరి, గొర్ల శ్రీనివాస్, కేకే1 పిట్ సెక్రెటరీ  మండ భాస్కర్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. 

మహిళా సర్పంచ్ పై హెచ్ఎం దౌర్జన్యం

బెల్లంపల్లి రూరల్, వెలుగు: ట్రైబల్ వెల్ఫేర్​రెసిడెన్షియల్​స్కూల్​హెచ్ఎం జ్ఞానేశ్వర్​తనపై దౌర్జన్యం చేశాడని దస్నాపూర్ సర్పంచ్ తాటిపాముల రాజేశ్వరి కలెక్టర్, ఐటీడీఏ డీటీడబ్ల్యూవో, నీల్వాయి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఆమె కథనం ప్రకారం.. దస్నాపూర్​ పరిధిలోని రెసిడెన్షియల్​ స్కూల్​ను బుధవారం విజిట్​చేసినట్లు తెలిపారు.  అప్పుడు స్టూడెంట్స్​ గోడలకు పేయింటింగ్​ వేస్తూ ఒకరితో ఒకరు గొడవపడ్డారు. వీడియో, ఫొటోలు తీసి పేయింటింగ్​ఎందుకు వేస్తున్నారని అడుగగా హెచ్ఎం వేయమన్నారని స్తూడెంట్స్​తెలిపారన్నారు.

అంతలోనే హెచ్ఎం, సిబ్బంది వచ్చి పర్మిషన్​ లేకుండా ఎలా వచ్చారని దుర్బాషలాడారని ఆమె ఆరోపించారు. మొబైల్​ లాక్కొని వీడియోలు, ఫొటోలు, పంచాయతీకి సంబంధించిన డాటాను డిలీట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో హెచ్​ఎం స్టూడెంట్స్​తో షెడ్ నిర్మాణం పనులు చేయించడంతో డీటీడబ్ల్యూవోకు ఫిర్యాదు చేస్తే మూడు నెలల క్రితం సస్పెండ్ అయ్యాడని తెలిపారు.

హామీలు నెరవేర్చడంలో సర్కార్ విఫలం

జన్నారం,వెలుగు: ఎన్నికలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో బీఆర్​ఎస్​సర్కార్​విఫలమైందని బీసీ కులాల ఉద్యమ పోరాట సమితి జిల్లా స్టీరింగ్​ కమిటీ సభ్యుడు కడార్ల నర్సయ్య ఆరోపించారు. గురువారం ఆయన స్థానికంగా మీడియాతో మాట్లాడారు.  బీసీల అభివృద్ధి కోసం 12 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా.. లాభం లేకుండా పోయిందన్నారు. హక్కుల కోసం బీసీలంతా ఐక్యంగా ఉద్యమించాలన్నారు. సమావేశంలో లీడర్లు కోడూరి చంద్రయ్య, కాసెట్టి లక్ష్మణ్, మూల భాస్కర్ గౌడ్, లక్ష్మీనారాయణ, గంగాధర్, ఒజ్జల రాజన్న తదితరులు పాల్గొన్నారు.

ఇయ్యాల టోల్​ప్లాజా ప్రారంభం

మందమర్రి,వెలుగు: మంచిర్యాల–చంద్రాపూర్​(మహారాష్ట్ర) నేషనల్ హైవే 363 ఫోర్​లేన్ మందమర్రి కేకే ఓసీపీ ఎదుట ఏర్పాటు చేసిన టోల్​ప్లాజా శుక్రవారం ప్రారంభిస్తున్నట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్​ఇండియా ప్రాజెక్టు డైరెక్టర్​తెలిపారు. మంచిర్యాల– -రేపల్లెవాడ సెక్షన్ లో 42 కి.మీ వరకు ఉన్న ఈ మార్గంలో ప్రయాణించే వాహనాలపై టోల్ టాక్స్​ వసూలు చేయనున్నారు. కలెక్టర్ భారతిహోళి కెరి ప్లాజాను ప్రారంభిస్తారన్నారు. అయితే ఫోర్​లేన్​పనులు పూర్తికాకుండానే టోల్​ప్లాజాను ప్రారంభించి ట్యాక్స్​వసూలు చేయడం ఏమిటని వాహనదారులు మండిపడుతున్నారు. 

మార్కెట్​ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం

బెల్లంపల్లి,వెలుగు: బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) నూతన పాలకవర్గం గురువారం ప్రమాణస్వీకారం చేసింది. మంత్రులు హరీశ్​రావు, ఇంద్ర కరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి సమక్షంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గజానంద్ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా భీమినికి చెందిన బోనగిరి నిరంజన్ గుప్తా, వైస్ చైర్మన్ ఆకుల లింగాగౌడ్, పాలకవర్గ సభ్యులుగా గట్టు సంతోష్ కుమార్, దెబ్బేటి రమేశ్, తలండి అశోక్, ఆకుల లింగాగౌడ్, తోట మధు, ఏనుగు మంజుల, సర్ల సర్డా, దొరిషెట్టి సత్యనాయణ, నల్ల సత్యనారాయణ, పెద్దబోయని శంకర్, మంచర్ల రత్నాకర్, అప్పాల చంద్రశేఖర్, జక్కుల శ్వేత ప్రమాణ స్వీకారం చేశారు.

ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రతినిధిగా నర్సాగౌడ్

నిర్మల్,వెలుగు: ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నిర్మల్ కు చెందిన అమరవేణి నర్సాగౌడ్​నియమితులయ్యారు. గురువారం ఆయనకు మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్ రాజ్  హైదరాబాద్​లో నియామక పత్రం అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో మోర్చా రాష్ట్ర  ప్రధాన కార్యదర్శులు దివాకర్, శ్రీకాంత్ గౌడ్, జాతీయ కమిటీ సభ్యులు పూసరాజు, స్టేట్ ప్రొగ్రాం కో ఆర్డినేటర్ ఆనంద్ గౌడ్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సాగౌడ్  మాట్లాడుతూ తన  నియామకానికి సహకరించిన పార్టీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, లీడర్లు అయ్యనగారి భూమయ్య, రావుల రాంనాథ్, మెడిసిమ్మ రాజు, రాజేశ్వర్ రెడ్డి, గంగాధర్, డాక్టర్ మల్లికార్జున్​రెడ్డి, అప్పాల గణేష్ చక్రవర్తికి కృతజ్ఞతలు తెలిపారు.