ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

వేములవాడ : అధికార పార్టీ తప్పులను ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని కాంగ్రెస్ ​సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. జీపీ సమస్యల పరిష్కారానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ ​ఇందిరా పార్కుకు వెళ్తున్న కాంగ్రెస్​ లీడర్లను పోలీసులు సోమవారం హౌస్ అరెస్ట్ చేశారు. వారిలో కాంగ్రెస్ రూరల్ అధ్యక్షుడు వి.శ్రీనివాస్, లీడర్లు కనకయ్య, సర్పంచులు కరుణాకర్, రాజ్ కుమార్ ఉన్నారు. 

జగిత్యాల: హైదరాబాద్​లో చేపట్టిన నిరసన కార్యక్రమానికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహించిన కాంగ్రెస్ లీడర్లు సోమవారం జగిత్యాల తహసీల్ చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ  మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని మండిపడ్డారు. 

జమ్మికుంట :పట్టణానికి చెందిన పలువురు కాంగ్రెస్​ లీడర్లు హైదరాబాద్ ​ఇందిరా పార్కుకు వెళ్తున్నారన్న సమాచారం పోలీసులు ముందస్తు అరెస్ట్​ చేసి పోలీస్​ స్టేషన్​కు తరలించారు. వారిలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సారంగపాణి, యూత్ కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గం ఉపాధ్యక్షుడు సజ్జాద్ మహమ్మద్, మత్స్య శాఖ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రాకేశ్, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు సూర్య, ఎండీ సలీం, ఎర్రం సతీశ్​రెడ్డి, పూదరి శివ, ఐలయ్య తదితరులు ఉన్నారు.

కోనరావుపేట : పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు హైదరాబాద్ ​వెళ్తున్న కాంగ్రెస్ కోనరావుపేట మండలాధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా, ఇతర లీడర్లను పొలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అరెస్టయిన వారిలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రుక్మిణి, మండల యూత్ అధ్యక్షుడు రవీందర్, నిత్యానందం,శోభన్​ ఉన్నారు. 

గంగాధర: హైదరాబాద్​ వెళుతున్న మండల కాంగ్రెస్ లీడర్లను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు. వారిలో డీసీసీ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బుచ్చన్న, కిసాన్ సెల్ మండలాధ్యక్షుడు గంగన్న, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వీరేశం, కార్యదర్శి కరుణాకర్, నాయకులు ఉన్నారు. 

సుల్తానాబాద్ : చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లకుండా మండల కాంగ్రెస్ లీడర్లను సుల్తానాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు. వారిలో లీడర్లు ప్రకాష్ రావు, దామోదర్ రావు, అబ్బయ్య గౌడ్, రఫిక్, రాజు, రాజయ్య, కిషోర్, రమేశ్, సంతోష్, రాజలింగం, తిరుపతి, మొబీన్, అమీనుద్దీన్ ఉన్నారు. 

కరీంనగర్​ : పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు హైదరాబాద్​తరలుతున్న జిల్లా కాంగ్రెస్​లీడర్ల అరెస్టులకు నిరసనగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో లీడర్లు సమద్ నవాబ్, శ్రవణ్ నాయక్, శ్రీనివాస్ రెడ్డి, బాబు, పోచయ్య, రమేశ్, రవీందర్, దన్న సింగ్, చాంద్ పాల్గొన్నారు.

కనులపండువగా ‘ముక్కోటి’ వేడుకలు 

కరీంనగర్  పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో సోమవారం ముక్కోటి ఏకాదశి వేడుకలు కనులపండువగా జరిగాయి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో లక్ష్మీ గణపతికి, రాజరాజేశ్వర దేవి అమ్మవార్లకు, అనంత పద్మనాభ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కరీంనగర్ మార్కెట్ రోడ్డులోని వేంకటేశ్వర స్వామి, వావిలాలపల్లి కోదండ రామాలయంలో, కోరుట్లలోని వేంకటేశ్వర స్వామి, సుల్తానాబాద్ వేణుగోపాల స్వామి, గంగాధర, కొత్తపల్లి మండలంలోని శివాలయాలు, లక్ష్మీనర్సింహ, వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో, ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. జగిత్యాల జిల్లా ధర్మపురి ఆలయంలో లక్ష్మీ సమేత యోగ, ఉగ్ర నరసింహ, వేంకటేశ్వర స్వాములకు క్షీరాభిషేకాలు చేశారు. జిల్లా కలెక్టర్ రవి దంపతులు, జెడ్పీ చైర్ పర్సన్ వసంత దంపతులు పూజలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్లలోని లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో, జమ్మికుంట, వీణవంకలోని వేంకటేశ్వర స్వామి, రామాలయం, గీతా మందిరంలో దేవతామూర్తులు ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు. మెట్ పల్లి వెంకటేశ్వర స్వామి, కోదండ రామాలయం, లక్ష్మీనరసింహ ఆలయం, చెన్న కేశవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. చొప్పదండిలోని శివకేశవాలయం, జ్ఞాన సరస్వతి ఆలయంలో, హుజూరాబాద్ సీతారామాలయం, వేంకటేశ్వరస్వామి ఆలయంలో, చిగురుమామిడి,సైదాపూర్ లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. -  వెలుగు, నెట్​వర్క్​

మళ్లించిన నిధులు జీపీల ఖాతాల్లో వేయాలి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల : మళ్లించిన కేంద్ర నిధులను వెంటనే గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చే యాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఇందీరా భవన్ లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్​ తో కలిసి ఆయన మాట్లాడారు. డిజిటల్ కీ పేరిట రూ.280 కోట్ల కేంద్రం నిధులను సీఎం కేసీఆర్ పక్కదారి పట్టించారన్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్ ల సంతకాలు లేకుండా డిజిటల్ కీతో డిసెంబర్ 25,26 తేదీల్లో అధికారులు రూ.280 కోట్లు దారి మళ్లించారన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకం నిధులు లేకుండా చేపడుతున్న ఒక్క కార్యక్రమం ఉందా చెపాలని మంత్రి దయాకర్ రావుకు సవాలు విసిరారు. గ్రామాల్లోని డంపింగ్ యార్డులు, రైతు వేడుకలు, పశువుల పాకలో, కంపోస్ట్ షెడ్లు, వైకుంఠధామాలు తదితర ప్రతీపని ఉపాధి హామీ పథకం కిందే చేపడుతున్నారన్నారు. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు కాగితాలకే పరిమితం అయ్యాయని, ట్రెజరీలో నిధులు జమ చేయక చెక్కులు నిలిపివేయడం రాష్ట్ర ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. సమావేశంలో పీసీసీ సభ్యులు నాగభూషణం, కృష్ణారావు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

నరేశ్‌‌‌‌పై చర్యలు తీసుకోవాలి  బీజేపీ, అయ్యప్ప స్వాముల రాస్తారోకో
గోదావరిఖని : నాస్తిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేశ్‌‌తో పాటు ఆయన మద్దతుదారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ స్టేట్​లీడర్​కౌశిక హరి, అయ్యప్ప స్వాములు, దళిత సంఘాల లీడర్లు డిమాండ్ చేశారు. సోమవారం రామగుండంలోని అంబేద్కర్‌‌‌‌ చౌక్‌‌‌‌ వద్ద కార్పొరేటర్‌‌‌‌ కౌశిక లత, ఎస్సీ రిజర్వేషన్‌‌‌‌ పరిరక్షణ సమితి, ఆర్యవైశ్య సంఘం, మహిళలు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేశ్‌‌‌‌, రెంజర్ల రాజేశ్‌‌‌‌ తదితరులు అంబేద్కర్‌‌‌‌ ఫొటోను అడ్డుపెట్టుకుని అయ్యప్ప, శివుడు, ఇతర దేవుళ్లపై, హిందూ సమాజాన్ని దూషిస్తున్నారని, ప్రజలు గమనించాలన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రామగుండం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు మధునయ్య, రాములు, రవి, మల్లికార్జున్‌‌‌‌, సంతోశ్‌‌‌‌, గంగా ప్రసాద్‌‌‌‌, రవి  తదితరులు 
పాల్గొన్నారు. 

సింగరేణి కాలనీలకు రంగు నీళ్లు ఆర్వో ప్లాంట్లపై ఆధారపడుతున్న కుటుంబాలు

గోదావరిఖని : సింగరేణి కార్మిక కాలనీలకు ఐదు రోజులుగా రంగు నీళ్లు సరఫరా అవుతుండడంతో కార్మిక కుటుంబాలు సమీపంలోని ఆర్వో ప్లాంట్లపై ఆధారపడుతున్నారు. గోదావరిఖని పవర్‌‌‌‌ హౌస్ కాలనీలో ఉన్న ఫిల్టర్‌‌‌‌ బెడ్‌‌‌‌ నుంచి ఫిల్టర్​ నీటిని గోదావరిఖనిలోని సెక్టార్‌‌‌‌ 1, 2 ఏరియాలతో పాటు యైటింక్లయిన్‌‌‌‌ కాలనీలోని 13,392 కార్మికుల క్వార్టర్లకు సప్లై చేస్తున్నారు. అయితే గోదావరి నది ఒడ్డున  గల ఇన్‌‌‌‌ఫిల్ట్రేషన్‌‌‌‌ గ్యాలరీల నుంచి వచ్చిన బురద నీటిని అక్కడే శుద్ధి చేసి పవర్‌‌‌‌ హౌస్ ఫిల్టర్‌‌‌‌ బెడ్‌‌‌‌ వద్ద తిరిగి శుద్ధి చేసినప్పటికీ అ నీటి రంగు మారడం లేదు. గోదావరిలో ఉన్న ఇన్‌‌‌‌ఫిల్ట్రేషన్ గ్యాలరీ పైపులైన్‌‌‌‌ మ్యాన్‌‌‌‌ హోల్స్‌‌‌‌లో లీకేజీ ఏర్పడితే రంగు నీళ్లు వస్తుయని, వెంటనే లీకేజీలను అరికట్టాలని, లేకపోతే ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌‌‌‌ నుంచి మిషన్‌‌‌‌ భగీరథ ద్వారా తమకు నీరు సరఫరా చేయాలని కార్మికులు కోరుతున్నారు. సోమవారం సింగరేణి ఆర్జీ 1 ఏరియా జీఎం నారాయణ, సివిల్‌‌‌‌ డీజీఎం నవీన్‌‌‌‌, ఇతర ఆఫీసర్లు పవర్‌‌‌‌హౌస్‌‌‌‌ కాలనీలోని సింగరేణి ఫిల్టర్ బెడ్‌‌‌‌ను పరిశీలించారు. గోదావరి నదిలో నిత్యం నీరు నిల్వ ఉండడం, గోదావరిఖని, రామగుండం తదితర పట్టణాల నుంచి వ్యర్థాలు నదిలో కలవడంతో రంగు నీళ్లు వస్తున్నాయని జీఎం అభిప్రాయపడ్డారు. నీటి శాంపిళ్లను ఈపీటీఆర్‌‌‌‌ఐకు పంపిస్తున్నామని, రిపోర్ట్‌‌‌‌ ఆధారంగా చర్యలు తీసుకుంటామని నారాయణ తెలిపారు. 

ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం ధర్నా

సిరిసిల్ల టౌన్ : సిరిసిల్ల జిల్లాలో డబుల్ ఇండ్ల కోసం నిర్వహించిన డ్రాలో పేర్లు రానివారికి వెంటనే స్థలంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ముశం రమేశ్​డిమాండ్​ చేశారు. సోమవారం సిరిసిల్లలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రాలో పేర్లు రాని వారందరికీ నెల రోజుల్లో ఇంటి స్థలం, రూ.5 లక్షలను ప్రభుత్వం కేటాయిస్తుందని కలెక్టర్ హామీ ఇచ్చారన్నారు. ఆరు నెలలు గడిచినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కోడం రమణ, సదానందం, పద్మ, నాయకులు అజయ్, గోవిందు లక్ష్మణ్ పాల్గొన్నారు.