ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

హాజరైన ప్లానింగ్ ​కమిషన్​ వైస్​ చైర్మన్​వినోద్​కుమార్, ఎమ్మెల్యే రవిశంకర్​

చొప్పదండి, వెలుగు: చొప్పదండి కొత్త వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్టేట్​ప్లానింగ్​కమిషన్​వైస్​చైర్మన్​బి.వినోద్​కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​తో కలిసి హాజరయ్యారు. కొత్త చైర్మన్​ గడ్డం చుక్కారెడ్డి, వైస్​ చైర్మన్ రాజశేఖర్​, డైరెక్టర్లతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వినోద్ కుమార్ మాట్లాడుతూ  మార్కెట్​ కమిటీ పాలకవర్గ కమిటీలో చోటు దక్కని వారు నిరాశపడొద్దని, ఓపికతో ఉంటే రానున్న తప్పకుండా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాణ స్వీకారానికి ముందు చొప్పదండి సబ్​ స్టేషన్​ నుంచి జీఆర్ఆర్​ ఫంక్షన్​హాల్​ వరకు బైక్​ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్​పర్సన్ విజయ, లైబ్రరీ సంస్థ చైర్మన్​ పొన్నం అనిల్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జడ్పీటీసీ సౌజన్య, మున్సిపల్​ వైస్​ చైర్మన్​ విజయలక్ష్మి, సర్పంచ్​లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

హాజరుకాని ఆశావహులు

చొప్పదండి ఏఎంసీ పాలకవర్గ నియామకంపై అసంతృప్తిగా ఉన్న ఆశావహులు ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉన్నారు. మున్సిపల్ చైర్​పర్సన్​గుర్రం నీరజ, ఎంపీపీ రవీందర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు లోక రాజేశ్వర్ రెడ్డి, ఏఎంసీ తాజా, మాజీ చైర్మన్ చంద్రశేఖర్​గౌడ్, మాజీ వైస్ చైర్మన్ గంగారెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు వెంకటరమణ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు మచ్చ రమేశ్ ఉన్నారు. ఏఎంసీ పాలవవర్గ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో ప్రొటోకాల్​తన ఫొటో పెట్టలేదని ఎంపీపీ రవీందర్​ 
ఆవేదన వ్యక్తం చేశారు. 

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

    దక్షిణ మధ్య రైల్వే జీఎం  అరుణ్​కుమార్​ జైన్​

పెద్దపల్లి, వెలుగు: రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని దక్షిణ మధ్య రైల్వే జనరల్​ మేనేజర్​ అరుణ్​కుమార్​ జైన్​ అన్నారు. కాజీపేట నుంచి పెద్దపల్లి వరకు రైల్వే స్టేషన్లు, లైన్లను శుక్రవారం అరుణ్​కుమార్​ పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు రైల్వే స్టేషన్ లో మూడో లైన్, అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. పెద్దపల్లి రైల్వే స్టేషన్​కు చేరుకున్న జీఎంను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్​ రెడ్డి కలిసి వినతిపత్రం ఇచ్చారు. హైదరాబాద్ టు నాగ్ పూర్, నవజీవన్ ఎక్స్​ప్రెస్, దక్షిణ్​, కేరళ వంటి సూపర్​ఫాస్ట్ రైళ్ళను ఆపాలని కోరారు. కరీంనగర్– పెద్దపల్లి మార్గంలో రైల్వే అండర్ బ్రిడ్జిలను విస్తరించాలని కోరారు. పెద్దపల్లి స్టేషన్లో ఎస్కలేటర్, పొత్కపల్లి లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని వినతిలో కోరారు. విన్నపాలపై రైల్వే జీఎం సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో రైల్వే అధికారులు, పలవురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

'క్యూ' వద్దు.. 'క్యూఆర్​ కోడ్​ ముద్దు’ను ప్రారంభించిన జీఎం

జమ్మికుంట, వెలుగు : సౌత్​సెంట్రల్​రైల్వే జీఎం అరుణ్​ కుమార్​ జైన్​ శుక్రవారం జమ్మికుంట రైల్వే స్టేషన్​ లో క్యూ ఆర్​ కోడ్​ టికెట్​ కౌంటర్​ ను ప్రారంభించారు. రైల్వే స్టేషన్​లలో క్యూ లో నిలబడి టికెట్​ కొనుగోలు చేసే బదులు, యూటీఎస్​ క్యూర్​ కోడ్​ను వినియోగించుకోవాలన్నారు. అంతకుముందు జీఎం అరుణ్​కుమార్​జైన్ కు ఎమ్మెల్సీ పాడి కౌశిక్​రెడ్డి, మున్సిపల్​చైర్మన్​తక్కలపల్లి రాజేశ్వర్​రావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్​రావు స్వాగతం పలికారు. అనంతరం 20కేవీ సోలార్​ప్లాంట్​ను జీఎం ప్రారంభించారు. రైల్వే స్టేషన్, ప్లాట్​ఫారం, ఉద్యోగుల క్వార్టర్స్ పరిశీలించారు. కొవిడ్​ టైంలో హాల్టింగ్​నిలిపేసిన రైళ్లకు మళ్లీ హాల్టింగ్​పునరుద్ధరించాలని ఎమ్మెల్సీ కౌశిక్​రెడ్డి, బీజేపీ కరీంనగర్​ రైల్వే బోర్డు మెంబర్​ పంజాల కళాధర్, జిల్లా ఉపాధ్యక్షులు సంపత్​ రావు వేర్వేరుగా జీఎంకు వినతిపత్రం ఇచ్చారు. 

రామగుండంలో 

గోదావరిఖని, వెలుగు : వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం రైల్వే స్టేషన్‌‌‌‌ను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌‌‌‌కుమార్‌‌‌‌ జైన్‌‌‌‌ సందర్శించారు. ఈ సందర్భంగా మహిళా లోకో పైలట్‌‌‌‌లకు విశ్రాంతి భవనం, రైల్వే స్టేషన్‌‌‌‌లో కాన్ఫరెన్స్‌‌‌‌ హాల్‌‌‌‌, రైల్వే షెడ్‌‌‌‌ సమీపంలో సీవరేజ్‌‌‌‌ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్లాంట్, రైల్వే కాలనీలో ఓపెన్‌‌‌‌ జిమ్‌‌‌‌, చిల్డన్స్‌‌‌‌ పార్క్‌‌‌‌ను ప్రారంభించారు. రామగుండంలో పలు రైళ్లకు హాల్టింగ్‌‌‌‌ కల్పించాలని కోరుతూ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌‌‌ జీఎంకు వినతిపత్రం అందజేశారు. కుందనపల్లి వద్ద ఆర్వోబీ నిర్మించాలని రైల్వే బోర్డు మెంబర్‌‌‌‌ వెంకటరమణ, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్‌‌‌‌ వెంకటేశ్‌‌‌‌ జీఎంకు వినతిపత్రం ఇచ్చారు. 

నేడు, రేపు ఓటర్ నమోదు క్యాంపెయిన్​

రాజన్న సిరిసిల్ల, వెలుగు: జిల్లాలో  ప్రత్యేక ఓటర్ నమోదు క్యాంపెయిన్ నిర్వహిస్తామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి  అనురాగ్ జయంతి శుక్రవారం  తెలిపారు. నేడు, రేపు తిరిగి డిసెంబర్ 3,4 తేదీలలో ఓటరు నమోదు కార్యక్రమాలు 
ఉంటాయన్నారు.  

కరీంనగర్ టౌన్, వెలుగు:  జనవరి 1, 2023 వరకు 18 ఏండ్లు నిండుతున్న ప్రతిఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని కలెక్టర్​  ఆర్వీ కర్ణన్ కోరారు. కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఈనెల26,27తో పాటు డిసెంబర్ 2, 3 తేదీల్లో ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 

విద్యార్థులు సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌కు దూరంగా ఉండాలి

సీపీ ఎస్‌‌‌‌.చంద్రశేఖర్‌‌‌‌ రెడ్డి

గోదావరిఖని, వెలుగు: విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు, కల్చరల్​ప్రోగ్రామ్స్​పై దృష్టి పెట్టాలని, సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ కు దూరంగా ఉండాలని రామగుండం పోలీస్​ కమిషనర్​ఎస్‌‌‌‌.చంద్రశేఖర రెడ్డి సూచించారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌‌‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలోత్సవ్‌‌‌‌ ముగింపు కార్యక్రమం శుక్రవారం గోదావరిఖని మార్కండేయకాలనీలో జరిగింది. ఈ సందర్భంగా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఎమ్మెల్యే చందర్‌‌‌‌ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ప్రతి సంవత్సరం బాలోత్సవ్‌‌‌‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సినీ, టీవీ నటులు సెల్వరాజ్‌‌‌‌, వంగ శ్రీనివాస్‌‌‌‌, బాలరాజ్‌‌‌‌ కుమార్‌‌‌‌, మూల విజయారెడ్డి, కాల్వ శ్రీనివాస్‌‌‌‌, ఎంఈఓ లక్ష్మీ పాల్గొన్నారు.

అనాథ పిల్లలకు ఆర్థిక సాయం

మల్లాపూర్ వెలుగు:- మల్లాపూర్​మండలం వాల్గొండలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు బీజేపీ నాయకుడు  సురభి నవీన్​ రూ.10వేల ఆర్థిక సాయం చేశారు. గుంటి బర్నాబా అనే గల్ఫ్ బాధితుడు ఆరునెలల కింద గుండె పోటుతో చనిపోగా, భార్య అమృత ఇటీవల అనారోగ్యంతో చనిపోయింది. దీంతో పిల్లలు అనాథలయ్యారు. విషయం తెలుసుకున్న నవీన్​.. చిన్నారుల వద్దకు వెళ్లి సాయం చేశారు. లీడర్లు సత్యనారాయణ, ప్రశాంత్, నాగరాజు, 
రమేశ్ ​పాల్గొన్నారు.

మహిళలపై నేరాలను అరికట్టాలి

కరీంనగర్ టౌన్, వెలుగు: మహిళలపై హింస, నేరాలను అరికట్టాలని, ఆ దిశగా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. మహిళలపై హింసా నిర్మూలన దినోత్సవం సందర్భంగా మహిళ, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో  మహిళా చట్టాలపై  అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అడిషనల్​కలెక్టర్​ మాట్లాడుతూ మహిళలు, బాలికలపై హింస నిర్మూలనకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు. సమావేశంలో అధికారులు కె.సబిత, లక్ష్మీ, ధనలక్ష్మీ పాల్గొన్నారు.

కోరుట్ల అభివృద్ధికి  కృషి చేస్తా..ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు

కోరుట్ల, వెలుగు: కోరుట్ల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్​రావు అన్నారు. శుక్రవారం  కోరుట్లలోని మున్సిపల్​ఆఫీస్​ లో  చైర్ పర్సన్ అన్నం లావణ్య  అధ్యక్షతన కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి చీఫ్​గెస్ట్​గా ఎమ్మెల్యే హాజరయ్యారు. సమావేశంలో 29 అంశాలను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. మద్దుల చెరువులో గుర్రపు డెక్క తొలగించేందుకు రూ.14 లక్షలు, ఇతరత్రా అభివృద్ధి పనులకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు. సమావేశంలో   వైస్ చైర్మన్ పవన్ ,  మున్సిపల్ కమిషనర్ ఎండీ అయాజ్,  అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

టాస్క్ ఫోర్స్ అదుపులో బొమ్మకల్ సర్పంచ్?

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్ ను  కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. శుక్రవారం ఉదయమే టాస్క్ ఫోర్స్ పోలీసులు బొమ్మకల్ కు వచ్చి తీసుకెళ్లినట్లు సమాచారం. ఏడాది కింద బొమ్మకల్ లో భూముల విషయంలో పలు అక్రమాలు బయటకు రావడంతో కేసులు నమోదయ్యాయి. ఈక్రమంలో శ్రీనివాస్​ 82 రోజులు జైలులో  ఉండి వచ్చారు. మళ్లీ పాత కేసుల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారా... లేక కొత్త కేసులు ఏమైనా ఉన్నాయా అనేది తేలడం లేదు.   

ఆర్అండ్ఆర్ సమస్యలు పరిష్కరించాలి బీజేపీ లీడర్ చంద్రుపట్ల సునీల్​రెడ్డి

పెద్దపల్లి, వెలుగు: ఆర్అండ్ఆర్​ ప్యాకేజీ సమస్యలను పరిష్కరించాలని బీజేపీ స్టేట్​ లీడర్​ చంద్రుపట్ల సునీల్​రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామస్తులతో  కలిసి సునీల్ రెడ్డి శుక్రవారం అడిషనల్​ కలెక్టర్​ లక్ష్మీనారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం సునీల్​ మాట్లాడుతూ సింగరేణి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన  బాధితులకు వెంటనే న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో లీడర్లు ములుమూరి శ్రీనివాస్, నాగరాజు, తోట్ల రాజు, సదాశివ్  పాల్గొన్నారు.

సర్పంచ్ పై మైనింగ్ ఏడీ బూతు పురాణం 

వాట్సప్ గ్రూపుల్లో ఆడియో వైరల్

ముత్తారం,వెలుగు:  సర్పంచ్ పై  ఓ మైనింగ్​అధికారి  అసభ్య పదజాలంతో దూషించిన ఆడియో మండలంలోని వాట్సప్ గ్రూప్ లో శుక్రవారం వైరల్ అయింది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి సర్పంచ్ సముద్రాల రమేశ్..  మానేరు వాగు నుంచి సాండ్​టాక్సీ పేరుతో ఇసుక మాఫియా జరుగుతోందని, ఈ విషయాన్ని  మైనింగ్ ఏడీ సాయినాథ్ కి సర్పంచ్ రమేశ్​ ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయగా ఆయన సర్పంచ్​ను అసభ్య పదజాలంతో దూషించారు. దీనికి సంబంధించి ఆడియో వైరల్​అయింది. ఈ విషయంపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు సర్పంచ్ తెలిపారు.

బొగ్గు ఉత్పత్తి లో ఓసీ 5 ప్రాజెక్ట్‌‌‌‌ ముందంజ

గోదావరిఖని, వెలుగు: సింగరేణి రామగుండం రీజియన్‌‌‌‌ పరిధిలోని ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ 5 ప్రాజెక్ట్‌‌‌‌ 135 శాతంతో బొగ్గు ఉత్పత్తిలో కంపెనీ వ్యాప్తంగా ఉన్న అన్ని ఓసీపీల కంటే ముందంజలో ఉందని ఏరియా జీఎం కె.నారాయణ తెలిపారు. ఓసీ 5 ప్రాజెక్ట్‌‌‌‌లో శుక్రవారం భూమ్‌‌‌‌ బ్యారియర్‌‌‌‌ చెక్‌‌‌‌పోస్ట్‌‌‌‌, రూ.70 లక్షల‍ వ్యయంతో ఫిల్టర్‌‌‌‌బెడ్‌‌‌‌, రూ.90 లక్షల వ్యయంతో ప్రాజెక్ట్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ నిర్మాణ పనులకు సింగరేణి చీఫ్​ఆఫ్‌‌‌‌ సెక్యూరిటీ బి.హన్మంతరావుతో కలిసి భూమి పూజ చేశారు.