ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

    ఎమ్మెల్యే రవిశంకర్​ 

గంగాధర, వెలుగు : నియోజకవర్గంలోని ఆరు మండలాలను రూ.650 కోట్లతో అభివృద్ధి చేశానని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గంగాధర మండలం బూరుగుపల్లిలోని తన నివాసంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని 54 జీపీలకు కొత్త భవనాల కోసం రూ.10.80 కోట్లు, పల్లె దవాఖానా భవన నిర్మాణాలకు ఒక్కో భవనానికి రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయించామన్నారు. పంచాయతీరాజ్ రోడ్ల కోసం రూ.22 కోట్లు, ఆర్​అండ్​బీ రోడ్ల కోసం రూ.6.15 కోట్లు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. చొప్పదండి పట్టణాన్ని రూ.72 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని, జగిత్యాల జిల్లాలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్​తో కొండగట్టు దేవస్థానానికి రూ.100 కోట్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. సమావేశంలో మున్సిపల్​ చైర్​పర్సన్​నీరజ, వైస్​ చైర్మన్ విజయలక్ష్మి, లీడర్లు పాల్గొన్నారు. 

సిమెంట్‌‌‌‌‌‌‌‌ కంపెనీలో కార్మికుడు మృతి

  నష్టపరిహారం చెల్లించాలని డెడ్​బాడీతో ఆందోళన

గోదావరిఖని, వెలుగు : పాలకుర్తి మండలం బసంత్‌‌‌‌నగర్‌‌‌‌ కేశోరాం సిమెంట్‌‌‌‌ కర్మాగారంలో రడం పరశురాం(55) అనే కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందడంతో నష్టపరిహారం చెల్లించాలని కార్మికులు ఆందోళన చేశారు. కార్మికుల కథనం ప్రకారం పాలకుర్తి మండలం ఈసాల తక్కళ్లపల్లికి చెందిన పరశురాం‌‌‌‌ సిమెంట్‌‌‌‌ కర్మాగారంలో ట్రేన్(2) విభాగంలో పని చేస్తున్నాడు. ఉదయం షిఫ్ట్‌‌‌‌ విధులకు హాజరై ట్రేన్ వద్ద పని చేస్తుండగా దాదాపు 30 మీటర్ల ఎత్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. తలకు త్రీవ గాయాలవడంతో తోటికార్మికులు పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలిస్తుండగా చనిపోయాడు. దీంతో కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షుడు సూర సమ్మయ్య, పర్మినెంట్ కార్మిక సంఘం అధ్యక్షుడు బయ్యపు మనోహర్ రెడ్డి, వైస్ ఎంపీపీ స్వామి, బీజేపీ లీడర్‌‌‌‌‌‌‌‌ కౌశిక హరి, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఫ్యాక్టరీ గేట్ ముందు మృత దేహాన్ని పెట్టి ఆందోళనకు దిగారు. అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ప్రమాదం జరిగిందని, మృతుడి కుటుంబానికి  రూ.40 లక్షలు ఎక్స్‌‌‌‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌‌‌‌ చేశారు. ఇతర కార్మికులు కూడా విధులు బహిష్కరించి కంపెనీ గేట్‌‌‌‌ ఎదుట బైఠాయించారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, బసంత్ నగర్ ఎస్ఐ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ వారిని సముదాయించారు. 

గ్రామాల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు

మెట్ పల్లి, వెలుగు: కోరుట్ల నియోజకవర్గంలోని గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కె.విద్యాసాగర్ రావు తెలిపారు. శుక్రవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ సాయిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో  సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.13 కోట్ల మంజూరుకు ప్రతిపాదనలు పంపించామని, జగ్గాసాగర్ ను మండల కేంద్రంగా చేస్తామని తెలిపారు. అంతకు ముందు పలువురు సర్పంచులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దెబ్బతిన్న తూములు, మత్తడుల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని పలువురు సభ్యులు కోరారు. సమావేశంలో ఎంపీడీఓ భీమేశ్, వైస్ ఎంపీపీ రాజేందర్, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

కనీస వేతనం అమలు చేయాలి

ఎమ్మార్వో ఆఫీస్ ముందు కార్మికుల ధర్నా

సిరిసిల్ల టౌన్, వెలుగు: ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతన చట్టం కింద తమకు వేతనం చెల్లించాలని సైజింగ్ కార్మికులు డిమాండ్​చేశారు. శుక్రవారం సిరిసిల్ల ఎమ్మార్వో ఆఫీస్ ముందు జిల్లా సైజింగ్ వర్కర్స్​ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్​ జిల్లా ప్రెసిడెంట్ కిషోర్ మాట్లాడుతూ కేటీఆర్ మంత్రిగా ఉన్న జిల్లాలో కార్మికుల సమస్యలు పట్టించుకునే వారే లేరన్నారు. సైజింగ్ ఓనర్స్ యాజమన్యం కార్మికులకు జోఓ ప్రకారం రూ.15,171 వేతనం ఇవ్వాల్సి ఉండగా రూ.7,850 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. అనంతరం ఎమ్మార్వో విజయ్​కుమార్​కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో  కార్మికులు అంజయ్య, యూసుఫ్, వెంకటేశం, ప్రకాశ్, రమేశ్, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.

యావర్ రోడ్డును విస్తరించాలని ర్యాలీ

జగిత్యాల, వెలుగు: పట్టణంలోని యావర్ రోడ్డు టవర్ సర్కిల్ లో రోడ్డు వెడల్పు చేయాలని బీజేపీ లీడర్లు శుక్రవారం  స్థానిక తహసీల్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నియోజకవర్గ ఇన్​చార్జి ముదుగంటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ యావర్ రోడ్డు విస్తరణ 20 సంవత్సరాల క్రితం మాస్టర్ ప్లాన్ లో ఉన్నా ఇంతవరకు అమలుకు నోచుకోలేదన్నారు. గెలిచిన 100 రోజుల్లోనే రోడ్డు విస్తరణ చేస్తానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇంతవరకు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ర్యాలీలో కౌన్సిలర్ గుర్రం రాము, లీడర్లు  తదితరులుపాల్గొన్నారు

స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలి

కలెక్టరేట్ ఎదుట ఆశా కార్యకర్తల ధర్నా

కరీంనగర్, వెలుగు: స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫార్సులకు అనుగుణంగా కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ఆశా కార్యకర్తలు శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్​ మాట్లాడుతూ ఐసీడీఎస్, ఎన్ హెచ్ఎం, ఉపాధి హామీ, సర్వశిక్షా అభియాన్ పథకం, ఎన్ హెచ్ ఆర్ఎం స్కీమ్ లలో దేశంలో కోటి మంది స్కీమ్ వర్కర్స్ సేవలు అందిస్తున్నారన్నారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పున్నం రవి, ఆశ యూనియన్ జిల్లా అధ్యక్షుడు శారద, ప్రధాన కార్యదర్శి మరెళ్లా శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికీ ఇండ్లు కేటాయించాలి: మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి

జగిత్యాల రూరల్, వెలుగు: అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి తెలిపారు. శుక్రవారం కౌన్సిలర్లతో కలిసి కలెక్టర్ రవికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇండ్ల పంపిణీ ప్రక్రియలో అవకతవకలు జరగకుండా రీ సర్వే చేపట్టాలన్నారు. ఈనెల 8వ తేదీలోపు అర్హులు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని శ్రావణి సూచించారు. ఆమె వెంట వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు    తదితరులు ఉన్నారు. 

రూ.650 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి: ఎమ్మెల్యే రవిశంకర్​ 

గంగాధర, వెలుగు : నియోజకవర్గంలోని ఆరు మండలాలను రూ.650 కోట్లతో అభివృద్ధి చేశానని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గంగాధర మండలం బూరుగుపల్లిలోని తన నివాసంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని 54 జీపీలకు కొత్త భవనాల కోసం రూ.10.80 కోట్లు, పల్లె దవాఖానా భవన నిర్మాణాలకు ఒక్కో భవనానికి రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయించామన్నారు. పంచాయతీరాజ్ రోడ్ల కోసం రూ.22 కోట్లు, ఆర్​అండ్​బీ రోడ్ల కోసం రూ.6.15 కోట్లు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. చొప్పదండి పట్టణాన్ని రూ.72 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని, జగిత్యాల జిల్లాలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్​తో కొండగట్టు దేవస్థానానికి రూ.100 కోట్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. సమావేశంలో మున్సిపల్​ చైర్​పర్సన్​నీరజ, వైస్​ చైర్మన్ విజయలక్ష్మి, లీడర్లు పాల్గొన్నారు.