నోరూరిస్తున్న గేవర్

సంవత్సరానికి ఒకసారి మాత్రమే లభించే   గేవెర్ స్వీట్స్ నిజామాబాద్ జిల్లా కేంద్రం లో ఊరిస్తున్నాయి. గుజరాత్, రాజస్థానీయులు స్థానికంగా ఎక్కువ మంది ఉంటారు. దీంతో ఈ వంటకం ఇక్కడ పాపులారిటీ సంతరించుకుంది. తమ బంధువులకు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ స్వీట్​ను ఇస్తుంటారు.  గంజ్​ రైల్వే గేట్ వద్ద ప్రత్యేకంగా  దీన్ని తయారు చేస్తున్నారు.  ఈ వంటకాన్ని   జనవరి 15 వరకు మాత్రమే తయారు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. దీని ధర కేజీకి రూ. 650 ఉంటుంది.  - నిజామాబాద్​ ఫొటోగ్రాఫర్​, వెలుగు