వెంకటాపూర్/రామప్ప, వెలుగు: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ను ఆదివారం బీజేపీ రాష్ట్ర నాయకుల బృందం సందర్శించింది. ఈ నెల 28న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటన నేపథ్యంలో బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ రామప్ప దేవాలయాన్ని దర్శించి, పర్యటన ఏర్పాట్లు పరిశీలించారు. రామప్ప టెంపుల్ కు ప్రసాద్ స్కీం కింద కేంద్రం నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లాడి తిరుపతి రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేశ్, మహబూబాబాద్ పార్లమెంట్ కో ఇ న్చార్జి సంతోష్, జిల్లా పదాధికారులు జినుకల కృష్ణాకర్ రావు, కొత్త సురేందర్, ములుగు అసెంబ్లీ కన్వీనర్ సిరికొండ బలరాం, జిల్లా కార్యదర్శి శీలమంతుల రవీంద్ర చారి, మండల అధ్యక్షుడు ఇమ్మడి రాకేశ్ యాదవ్, యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొంతి రెడ్డి రాకేశ్ రెడ్డి, మహమ్మద్ మీరా, దొంతిరెడ్డి రవి రెడ్డి, గద్దల రఘు తదితరులు పాల్గొన్నారు.
వాజ్‌పేయిని యాది చేసుకున్నరు..
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా ఆదివారం ఉమ్మడి జిల్లా బీజేపీ లీడర్లు యాది చేసుకున్నారు. ఆయన విగ్రహాలకు, ఫొటోలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కేక్‌కట్‌చేసి పంచి పెట్టారు. ఆస్పత్రులలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ‘పార్టీ కన్నా దేశం మిన్న’ అని నమ్మిన గొప్ప వ్యక్తి వాజ్ పేయి అన్నారు. ఆయన నేతృత్వంలో కేంద్రం ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. బీజేపీ నేతలు శ్రీరాములు, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, రావు పద్మ, డాక్టర్ విజయరామారావు, సదానందం గౌడ్, ఒద్దిరాజు రామచంద్ర రావు, సోమయ్య, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. – నెట్వర్క్, వెలుగు
పేద విద్యార్థికి ఎమ్మెల్సీ ఆర్థిక సాయం
రఘునాథపల్లి , వెలుగు: ఐఐటీలో సీటు సాధించి.. ఆర్థిక ఇబ్బందులతో అక్కడికి వెళ్లలేని ఓ పేద విద్యార్థికి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆర్థికసాయం చేశారు. మండలంలోని భానాజీపేట గ్రామానికి చెందిన చాట్ల గణేశ్ కూతురు శివాని ఉత్తర ప్రదేశ్.. వారణాసిలోని ఐఐటీ కాలేజీలో ఎంఎస్సీ సీటు సాధించింది. కానీ అక్కడికి వెళ్లేందుకు ఆర్థిక స్థోమ సరిపోక వెళ్లలేదు. విషయం తెలుసుకున్న కడియం ఆదివారం హన్మకొండలోని తన నివాసానికి పిలిపించుకుని రూ. 21 వేల ఆర్థిక సాయం అందించారు. మారుజోడు రాంబాబు , మాజీ సర్పంచ్ గైని శ్రీనివాస్ ఉన్నారు.
గ్రాండ్‌గా క్రిస్మస్..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే భక్తుల ప్రార్థనలతో మార్మోగాయి. అన్ని చర్చిలలో కేకులు కట్‌చేసి, స్వీట్లు పంచుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు, రాజకీయ నాయకులు వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు చెప్పారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్సీఎం చర్చిలో ఎమ్మెల్యే రాజయ్య మోకాళ్లపై కూర్చొని ప్రార్థన చేశారు. - నెట్వర్క్, వెలుగు: