సిగరెట్ కోసం వచ్చి.. పుస్తెల తాడు లాక్కెళ్లిన్రు! 

మిర్యాలగూడ, వెలుగు : మిర్యాలగూడ పట్టణంలోని రాంచంద్రగూడెం బైపాస్​ రోడ్డులోని శ్రీనిధి కాలనీలో  కిరాణ షాపును నడుపుతున్న మహిళ మెడలో నుంచి  మంగళవారం ఓ దుండగుడు పుస్తెల తాడును బలవంతంగా లాక్కెళ్లాడు.  మహిళ నడిపిస్తున్న షాపుకు మూడ్రోజులుగా వస్తున్న ఓ ముగ్గురు వ్యక్తుల్లో ... ఒకరూ సిగరేట్​ కావాలని అడిగారు. మహిళ సిగరేట్​ ఇచ్చేందుకు లోపలకి వెళ్తుండగా .. ఆమె మెడలోని మూడు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కుని బైక్​పై పరారయ్యారు.

సదరు వ్యక్తులు తాము సెంట్రింగ్​ పనిచేస్తున్నట్లు చెప్పారని బాధితురాలు పేర్కొంది. ఇదే విషయమై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న టూటౌన్​ సీఐ నర్సింగరావు, ఎస్​ఐ సైదిరెడ్డి ఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు.