ఒకరి కోసం వచ్చి మరొకరిపై దాడి.. నలుగురిపై కేసు నమోదు

ఒకరి కోసం వచ్చి మరొకరిపై దాడి.. నలుగురిపై కేసు నమోదు

కూకట్​పల్లి, వెలుగు: ఒకరిపై దాడి చేయడానికి వచ్చిన నలుగురు అదే పేరుతో ఉన్న మరో వ్యక్తిని తీవ్రంగా గాయపరిచారు. ఏపీలోని కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన గాలి వరప్రసాద్..​ కేపీహెచ్​బీ ధర్మారెడ్డి కాలనీలోని ఓ పీజీలో ఉంటున్నాడు. ఈ నెల17న అర్ధరాత్రి సమయంలో ముగ్గురు యువకులు, ఒక యువతి అతను ఉంటున్న పీజీకి వచ్చి వరప్రసాద్​కోసం అడిగారు. దీంతో నిర్వాహకులు హాస్టల్​లో ఉంటున్న గాలి వరప్రసాద్​ను పిలిపించారు. అతను రాగానే ముఖం కూడా చూడకుండా దాడి చేశారు. అసలు విషయం తెలియడంతో నలుగురు నిందితులు అక్కడ నుంచి పరారయ్యారు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.