ఆలేరు అభివృద్ధికి కలిసి రండి : బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు: ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి  కోసం పార్టీలకతీతంగా అందరూ కలిసిరావాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పిలుపునిచ్చారు.  యాదగిరిగుట్ట మండలం మహబూబ్ పేట గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ పల్లెపాటి ప్రభాకర్, పీఏసీఎస్ డైరెక్టర్ ఆరె రమేశ్‌‌ ఆధ్వర్యంలో 50 మంది బీఆర్ఎస్ నాయకులు శనివారం కాంగ్రెస్ లో చేరారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత అసమర్థత కారణంగా నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తన ఆస్తులను పెంచుకోవడంపై పెట్టిన శ్రద్ధ ఆలేరును అభివృద్ధి చేయడంపై పెట్టలేదని విమర్శించారు.