తెలుగు రాష్ట్రాలకు రూ.6 లక్షల సాయం – ఆలీ, జుబేదాఆలీ

ప్రముఖ నటుడు ఆలీ అతని సతీమణి జుబేదాఅలీ తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం తమ వంతు సాయాన్ని ప్రకటించారు.

ఈ మేరకు "తెలుగు రాష్ట్రాలకు వరదల వల్ల ఎంతగా నష్టం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల పరిస్థితిని చూసి నేను నా భార్య జుబేదా ఎంతో బాధపడ్డాం. మా వంతుగా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఆరు లక్షల (ఆంధ్రప్రదేశ్‌కు 3 లక్షలు, తెలంగాణాకు 3 లక్షలు) రూపాయలను సీయం రిలీఫ్‌ ఫండ్‌కు అందచేస్తాం అని" ప్రముఖ నటుడు అలీ అన్నారు.

ఇప్పటికే ఎంతో మంది సినిమా తారలు తమ వంతు సాయాన్ని తెలుగు ప్రజలకి అందించారు.ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని వెల్లడిస్తున్నారు.