హాస్య నటుడు అలీకి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి జైతున్ బీబీ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈ ఉదయం రాజమహేంద్రవరంలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం షూటింగ్ కోసం రాంచీలో ఉన్న అలీ.. తల్లి మరణవార్త తెలియగానే హుటాహుటీన హైదరాబాద్ బయలుదేరారు. జైతున్ బీబీ భౌతిక కాయాన్ని రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు బంధవులు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ లో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
మరిన్ని వార్తలు…
కాషాయ నేతలు పెండ్లి చేసుకోరు.. రేప్‌లు చేస్తరు