చంపేస్తామంటూ.. కమెడియన్ కపిల్ శర్మకు బెదిరింపులు

చంపేస్తామంటూ.. కమెడియన్ కపిల్ శర్మకు బెదిరింపులు

బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ నటులు ‘చంపేస్తామంటూ’ వస్తున్న బెదిరిపులతో వణికిపోతున్నారు. గత కొంత కాలంగా సిని ప్రముఖులు బెదిరింపులకు గురవుతున్నారు. నటుడు సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ వంటి ప్రముఖులకు బెదిరింపులు వచ్చాయి.. ఇటీల సైఫ్ అలీఖాన్ పై ఏకంగా దాడే జరిగింది.. ఆరురోజుల చికిత్స అనంతరం బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. బెదిరింపులు ఎదుర్కొంటున్న సిని నటుల లిస్టులో తాజా మరికొందరు చేరారు.  

బాలీవుడ నటుడు, ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు కపిల్ శర్మను హత్య చేస్తామంటూ ఈమెయిల్స్ పంపించారు. మరో బాలీవుడ్ నటుడు రాజ్ పాల్ యాదవ్, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజాకు కూడా ఈ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. బెదిరింపు ఈమెయిల్స్ పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు  పోలీసుల ప్రాథమిక విచారణ తేలింది. కపిల్ శర్మ తోపాటు వారి కుటుంబ సభ్యులు, సన్నిహితుల లక్ష్యంగా కూడా వచ్చాయని తెలుస్తోంది. రాజ్‌పాల్ యాదవ్ భార్య చేసిన ఫిర్యాదు మేరకు అంబోలి పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై BNS సెక్షన్ 351(3) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బెదిరింపు ఇమెయిల్‌లు పాకిస్తాన్ నుంచి వచ్చాయని ప్రాథమిక పరిశోధనలు తెలుస్తోంది. don99284@gmail.com ఇమెయిల్ చిరునామా ద్వారా ఇమెయిల్ సంతకంలో తమను తాము "విష్ణు"గా చెప్పుకుంటూ పంపించారు. సెలెబ్రిటీల ఇటీవలి చర్యలను పంపినవారు పర్యవేక్షిస్తున్నారని ఇమెయిల్‌ల కంటెంట్ పేర్కొంది.