టాలీవుడ్ కమెడియన్, బిగ్ బాస్ ఫేమ్ మహేష్ విట్టా(Mahesh vitta) ఓ ఇంటివాడయ్యాడు. తాను ప్రేమించిన ఆమ్మాయి శ్రావణి(Shravani)ని సైలెంట్ గా పెళ్లిచేసుకున్నాడు. ఇదే విషయాన్నీ తన ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకున్నాడు మహేష్. ప్రస్తుతం మహేష్ పెళ్ళికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహేష్ విట్టా పెళ్లి వార్త విన్న ఆయన అభిమానులు, నెటిజన్స్ షాకవుతున్నారు. సడన్ గా ఇంత షాకిచ్చావేంటన్నా? ఎనీ వే కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక మహేష్ విట్టా విషయానికి వస్తే.. కెరీర్ స్టార్టింగ్ లో యూట్యూబ్‌లో చిత్తూర్ స్లాంగ్‌లో కామెడీ షార్ట్ ఫిల్మ్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనంతరం పలు సినిమాల్లో కమెడియన్ గా నటించాడు. ఈ గుర్తింపుతో బిగ్ బాస్ సీజన్ 3 (Bigg Boss 3)లో అవకాశం దక్కించుకుని .. మరింత ఫేమ్ ను సంపాదించుకున్నాడు.