స్టార్ హీరోకు కోడలు కాబోతున్న..కమెడియన్ పృథ్వీరాజ్ కుమార్తె!

స్టార్ హీరోకు కోడలు కాబోతున్న..కమెడియన్ పృథ్వీరాజ్ కుమార్తె!

టాలీవుడ్లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ (30 Years Industry).. డైలాగ్ అంటే..టక్కున గుర్తొచ్చే పేరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పృథ్వీరాజ్ (Prudhvi Raj). ఎక్కువగా కామిక్ రోల్స్, విలన్ రోల్స్లో నటిస్తూ అందరికీ పరిచయమయ్యారు. ఇప్పటివరకు దాదాపు 75 చిత్రాలకు పైగా నటించిన పృథ్వీరాజ్..కృష్ణవంశీ ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ..అనే డైలాగుతో బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. అసలు విషయానికి వస్తే.. 

ప్రస్తుతం ఆయన కూతురు శ్రీలు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. తన కూతురిని ఇండస్ట్రీకి పరిచయం చేయాడానికి పృథ్వీ రాజ్ దర్శకుడిగా మారబోతున్నారు. ఆయన తన కుమార్తె శ్రీలును హీరోయిన్‌గా పరిచయం చేస్తూ..‘కొత్త రంగుల ప్రపంచం’ అనే మూవీ తీస్తున్నారు.

లేటెస్ట్గా ఫృథ్వీ రాజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కూతురు పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. మీ  కుమార్తె శ్రీలు ఓ స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళ్లబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్ననేపథ్యంలో..ఇందులో నిజమెంత? అని అడగగా..ఫృథ్వీ రాజ్ క్లారిటీ ఇచ్చినట్టే..ఇచ్చి దాచేశారు. వెళ్లవచ్చేమో? ఫ్యూచర్ మన చేతుల్లో లేదు కదా..ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు..అంటూ సమాధానమిచ్చారు.

అయితే, శ్రీలు ప్రేమలో ఉన్న ఆ హీరో ఎవరనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో పెళ్లి న్యూస్ నిజమై ఉండొచ్చు..మరి హీరో ఎవరై ఉంటారు అని..ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. 
 ఫృథ్వీ రాజ్ కమెడియన్గా మంచి ఫామ్లో ఉన్న టైంలోనే..రాజకీయాల్లో వెళ్లిపోయి మధ్యలో కొన్ని విమర్శలు ఎదుర్కుని..తన పదవిని కోల్పోయారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ మంచి నటుడిగా రాణిస్తున్నారు.