తగ్గేదేలా అంటూ బూతులు తిట్టిన కమెడియన్ పృధ్వీ.. మిడిల్ ఫింగర్ ఫొటోతో హీరో విశ్వక్ సేన్..

తగ్గేదేలా అంటూ బూతులు తిట్టిన కమెడియన్ పృధ్వీ.. మిడిల్ ఫింగర్ ఫొటోతో హీరో విశ్వక్ సేన్..

టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కాంట్రవర్సీ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. అయితే నటుడు పృథ్వీ వైసీపీ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతన్నారు. అయితే విశ్వక్ సేన్ తాను లేని సమయంలో ఆలా జరిగిందని ఉంటే ఆలా జరగనిచ్చేవాడిని కాదని చెబుతూ క్షమాపణ కూడా చెప్పాడు. దీంతో ఈ వివాదం దాదాపుగా సర్దుమణిగింది. 

అయితే నటుడు పృథ్వీ ఈ ఇన్సిడెంట్ తర్వాత హాస్పిటల్ చేరాడు. అయినప్పటికీ హాస్పిటల్ బెడ్ మీద నుంచి కూడా వైసీపీ పార్టీపై అసభ్య పదజాలం ఉపయోగిస్తూ కామెంట్లు చేశాడు. కొందరు ఫోన్ కాల్స్ చేసి తన తల్లిని దూషిస్తున్నాడు. ఈ క్రమంలో జనసేన, వైసీపీ పార్టీ కార్యకర్తలమని చెబుతూ టార్చర్ చేస్తున్నారని వాపోయాడు. పృధ్వీ కూడా వైసీపీ ఫ్యాన్స్ ని బూతులు తిడుతూ దూషించాడు. దీంతో మళ్ళీ వైసీపీ ఫ్యాన్స్ లైలా సినిమాని ట్రోల్ చేస్తున్నారు. 

Also Read :- ఫ్యాన్స్కు మాస్ ట్రీట్

దీంతో హీరో విశ్వక్ సేన్ సోషల్ మీడియా వేదికగా స్పదించాడు. ఇందులోభాగంగా  "నా సినిమాకి సంబందించిన ప్ర‌తి పోస్ట‌ర్ నా సినిమాకి సంబంధించింది మాత్రమే. ఇది సోను మోడ‌ల్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ నెల క్రితం విడుద‌లైంది. ప్రస్తుతం ఉన్న రెడ్ సూట్ ఫోటో కూడా గతంలోనిది. నా సినిమా గురించి నేను వేసే ప్రతి పోస్టర్ లేదా పోస్ట్ ముందు నేను ఒకటికి రెండుసార్లు ఆలోచించలేను. ప్రతీసారి తగ్గను. నిన్న మనస్ఫూర్తిగా సారీ చెప్పా ..  అతిగా ఆలోచించడం మానేసి కొంచెం శాంతంగా ఉండండి..  మళ్లీ చెబుతున్నా - నేను నటుడ్ని మాత్రమే , నన్ను నా సినిమా రాజకీయాల్లోకి లాగకండి." అని ఎక్స్ లో పేర్కొన్నాడు. అయితే ఇందులో రెడ్ సూట్ లో ఉన్న పోజ్ లో విశ్వక్ మిడిల్ ఫింగర్ ని చూపిస్తూ కనిపించాడు. దీంతో మరోసారి కాంట్రవర్సీ కి తెరలేపింది.

ఈ విషయం ఇలా ఉండగా లైలా సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతోంది. ఇప్ప

టివరకూ ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు. టీజర్, ట్రైలర్స్ ఆడియన్స్ ని బాగానే అలరించాయి. కానీ ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇన్సిడెంట్ దాదాపుగా సినిమా రిజల్ట్స్ పై ప్రభావం చూపింది.