టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి ఇంట్లో విషాదం

టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి ఇంట్లో విషాదం

టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి ఇంట్లో విషాదం నెలకొంది. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సప్తగిరి తల్లి చిట్టెమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం( ఏప్రిల్ 8)న తుది శ్వాస విడిచారు.. ఇవాళ( ఏప్రిల్ 9)న తిరుపతిలో  అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ విషయాన్ని సప్తగిరి తన ఎక్స్ లో తెలిపారు.

పలువురు సినీ నటులు సప్తగిరి తల్లి మృతిపట్ల సంతాపం తెలిపారు. ఇవాళ తిరుపతిలో జరగనున్న అంత్యక్రియలకు పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.

సప్తిగిరి పూర్తి పేరు వెంకట ప్రభు ప్రసాద్. సప్తగిరి 2006లో బొమ్మరిల్లు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. రీసెంట్ గా పెళ్లి కాని ప్రసాద్ అనే సినిమాలో నటించాడు.