Mathu Vadalara2 Twitter X Review: మత్తు వదలరా 2 ట్విట్టర్ X రివ్యూ..సత్య కామెడీ అదిరిపోయిందట!

Mathu Vadalara2 Twitter X Review: మత్తు వదలరా 2 ట్విట్టర్ X రివ్యూ..సత్య కామెడీ అదిరిపోయిందట!

'మత్తు వదలరా’ చిత్రంతో సక్సెస్‌‌‌‌‌‌‌‌ను అందుకున్న కీరవాణి కొడుకు శ్రీసింహ కోడూరి..ఇప్పుడు దీని సీక్వెల్‌‌‌‌‌‌‌‌ (మత్తు వదలరా 2) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా లీడ్‌ రోల్‌లో నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ మూవీ ఇవాళ (సెప్టెంబరు 13న) థియేటర్‌లో రిలీజయింది. టీజర్, ట్రైలర్ తో చూపించిన కామెడీ ఎంటర్ టైన్ మెంట్..రిలీజయ్యాక కూడా  ఆడియాన్స్ లో ఎలాంటి అంచనాలు పెంచేసిందో ట్విట్టర్ X రివ్యూలో చూద్దాం. 

Also Read:-ఇవాళ థియేటర్‌లో రిలీజ్ కాబోయే తెలుగు సినిమాలు ఇవే

ఫరియా కూడా పర్వాలేదని, బాగా కనిపించిందని చెబుతున్నారు. ఈ సీక్వెల్ అదిరిపోయిందని ఆడియెన్స్ చెబుతున్నారు. ఇప్పటికే ట్విట్టర్‌లో మత్తు వదలరా 2 బాగానే ట్రెండ్ అవుతోంది. ఎస్ ఎస్ కార్తికేయ కూడా ఈ మూవీని చూసి రివ్యూ ఇచ్చేశాడు. గురువారం రాత్రి వేసిన సెలెబ్రిటీ ప్రీమియర్ షోను డైరెక్టర్ రాజమౌళి కొడుకు కార్తికేయ చూసినట్టుగా కనిపిస్తోంది.

మత్తు వదలరా 2 ఫెంటాస్టిక్ సీక్వెల్.. రితేష్ రానా అద్భుతంగా తీశాడు.. ప్రతీ ఒక్క సీన్‌ను ఎంజాయ్ చేశా.. కామెడీ, థ్రిల్ ఇలా ప్రతీ ఒక్కటీ మొదటి పార్టులో ఎంత ఎంజాయ్ చేశానో.. ఇందులో కూడా అంతే ఎంజాయ్ చేశా.. సత్య ఎప్పటిలానే చితక్కొట్టేశాడు. వన్ లైనర్ పంచ్‌లు, కామెడీతో అదరగొట్టేశాడు.. ఫరియా బాగుంది.. ఈ గ్యాంగులో బాగా కలిసి పోయింది.. సింహా ఎంతో సహజంగా అనిపించాడు..

మత్తు వదలరా 2 మూవీలో కమెడియన్ సత్య రచ్చ రంబోలా? తన కామెడీతో ఇరుగదీశాడు. వెర్రితనంతో ఇచ్చిపడేశాడు. ఈ జనరేషన్ యాక్టర్ ఆయనే. నవ్వి నవ్వి కడుపు పగిలిపోతుంది. ఫస్టాఫ్ సూపర్‌గా ఉంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 

మత్తు వదలరా రెడ్ కార్పెట్ షో చూశాను. సినిమా ఫస్టాఫ్ బాగుంది. ప్యూర్‌గా సత్య కామెడీ రాంపేజ్ అదిరిపోయింది. నవ్వలేక పొట్ట నొప్పి వచ్చింది. కమెడియన్ సత్య మన టాలీవుడ్ కి దొరికిన ఆణిముత్యం. ఈ సినిమాలో నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్. సెకండాఫ్ హాఫ్ బాగుంది. ఈ రేంజ్‌లో ఉంటే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనిమరో నెటిజన్ కామెంట్ చేశాడు.

ఇకపోతే..మెగాస్టార్ చిరంజీవికి 'మత్తు వదలరా' డైరెక్టర్ రితేష్ రాణా డై హార్డ్ ఫ్యాన్ ఏమో అని పలువురు నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. ఎందుకంటే..ఆ సినిమా స్టార్టింగ్, ఇంటర్వెల్, క్లైమాక్స్ చిరు రెఫరెన్సులతో ముగించిన విధానం బాగుంది. ఇప్పుడీ 'మత్తు వదలరా 2'లో కూడా సేమ్ టు సేమ్ అని సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ 'ఎక్స్'లో జనాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మత్తు వదలరా సినిమాలో చిరంజీవి రిఫరెన్సులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక ఈ పార్టులోనూ చిరంజీవి రిఫరెన్సులే ఎక్కువగా ఉన్నాయని, అవి బాగా వర్కౌట్ అయ్యాయని అంటున్నారు. రితేష్ రానా మెగాస్టార్ చిరు ఫ్యాన్ కాబట్టి.. ఇలా రిఫరెన్సులు పెట్టుకున్నాడట. ఆ రిఫరెన్సులు బాగానే కలిసి వచ్చాయని అంతా అంటున్నారు. మొత్తానికి సినిమా బాక్సాఫీస్ వద్ద పాస్ అయిపోయినట్టే అని చెబుతున్నారు.

మత్తు వదలరా 2 చిత్రంలో మంచి ట్విస్టులు, టర్న్స్ కూడా ఉన్నాయట. లాస్ట్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుందట. ఇక సత్య వన్ మెన్ షోలా సినిమా అంతా నవ్వించేశాడని అంటున్నారు. ఈ మూవీకి కూడా సత్యనే హీరో అన్నట్టుగా చెబుతున్నారు.

ఈ సినిమాకు ఫస్ట్ షోకి వచ్చిన ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే సీక్వెల్ ని మించి హిట్ అయ్యేలా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో కమెడియన్ సత్య చేసే హంగామాని పలువురు వీడియోస్ పోస్ట్ చేస్తూ తమ ఫీలింగ్స్ ని తెలుపుతున్నారు.