కమెడియన్ వెన్నెల కిషోర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘చారి 111’. సంయుక్తా విశ్వనాథ్ హీరోయిన్. ‘మళ్ళీ మొదలైంది’ ఫేమ్ టీజీ కీర్తి కుమార్ దర్శకుడు. అదితి సోనీ నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో వెన్నెల కిషోర్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో గూఢచారిగా కనిపిస్తుంటే.. హీరోయిన్ సంయుక్తా విశ్వనాథ్ గ్లామరస్ లుక్‌లో ఆకట్టుకుంది.
ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఇదొక స్పై యాక్షన్ కామెడీ మూవీ. సిల్లీ మిస్టేక్స్ చేస్తూ కన్‌ఫ్యూజ్డ్‌గా ఉండే చారి అనే స్పై ఏజెంట్ ఓ పెద్ద కేసును ఎలా సాల్వ్ చేశాడనేది మెయిన్ కాన్సెప్ట్. గూఢచారి సంస్థ హెడ్‌గా కథలో కీలకమైన పాత్రలో మురళీ శర్మ కనిపిస్తారు’ అని చెప్పాడు. ‘స్పై జానర్ సినిమాల్లో ఇది కొత్తగా ఉంటుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. వెన్నెల కిషోర్ నటన సినిమాకు హైలైట్ అవుతుంది’ అని నిర్మాత అదితి సోనీ తెలిపారు.