బ్రహ్మానందం వెయ్యికి పైగా సినిమాల్లో తనదైన హాస్యంతో కడుపుబ్బ నవ్వించారు. బుధవారం 67వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్న ‘కీడాకోలా’ సినిమాలోని లుక్‌ని రిలీజ్ చేస్తూ ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్పారు. పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న తరుణ్ భాస్కర్.. సరికొత్త క్రైమ్ కామెడీ కంటెంట్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎనిమిది ప్రధాన పాత్రలు ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న బ్రహ్మానందం ఫస్ట్ లుక్‌తో పాటు ఆయన పాత్రను పరిచయం చేశారు.
ఫస్ట్ లుక్‌లో బ్రహ్మానందం పజిల్ ఫేస్ ఆకట్టుకుంది. ‘మీ ప్రపంచం వింతగా మారబోతోంది’ అని పోస్టర్‌పై క్యాప్షన్ ఇవ్వడం ఇంటరెస్టింగ్‌గా ఉంది. ‘నెవర్ బిఫోర్ క్యారెక్టర్‌లో బ్రహ్మానందం గారిని చూపించబోతున్నాం. ప్రతీ ఇంట్లో ఉండే తాత పాత్రలో ఆయన కనిపిస్తారు. పేరు.. వరదరాజు. మిస్టర్ బి. మీకు ఖర్చులకి ఇచ్చేస్తాడు’ అని ట్వీట్ చేశాడు తరుణ్ భాస్కర్. భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.