- రెడీ చేస్తున్న రష్యా!కొత్త ఏడాదిలో
మాస్కో : క్యాన్సర్ ను సమర్థవంతంగా అడ్డుకునే వ్యాక్సిన్ సిద్ధం చేస్తున్నట్లు రష్యా ప్రకటించింది. వ్యాక్సిన్ తయారీ ప్రస్తుతం తుది దశలో ఉందని, కొత్త ఏడాదిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొంది. క్యాన్సర్ తో బాధపడుతున్న రష్యన్లకు ఈ వ్యాక్సిన్ ను ఫ్రీగా అందించనున్నట్లు రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ అండ్రీ కాప్రిన్ చెప్పారు. రష్యా అధికారిక న్యూస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం.. క్యాన్సర్ కు అడ్డుకట్ట వేసే సరికొత్త ఎంఆర్ఎన్ ఏ వ్యాక్సిన్ సిద్ధమవుతోంది. శరీరంలోని క్యాన్సర్ కణుతులు పెరగకుండా, వ్యాధి ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా ఈ వ్యాక్సిన్ నియంత్రిస్తుందని పేర్కొంది.
మిగతా వ్యాక్సిన్ల మాదిరి అందరికీ ఒకటే ఇవ్వకుండా పేషెంట్ శరీర తత్వానికి సరిపడేలా పర్సనలైజ్డ్ గా తయారు చేసివ్వాల్సి ఉంటుందని వివరించింది. అయితే, ప్రస్తుతం రష్యా తయారుచేస్తున్న వ్యాక్సిన్ పేరు కానీ, అది ఏ రకమైన క్యాన్సర్కట్టడికి పనిచేస్తుందనే వివరాలు కానీ, ఎలా పనిచేస్తుందనే వివరాలు కానీ అందుబాటులో లేవని సమాచారం. క్యాన్సర్ టీకా తయారీ విషయాన్ని ప్రెసిడెంట్ పుతిన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించారు.