త్వరలో నేషనల్​ హెల్త్ క్లెయిమ్స్​ ఎక్స్ చేంజ్.. ఐఆర్​డీఏ చైర్మన్​ వెల్లడి

న్యూఢిల్లీ: హెల్త్​ ఇన్సూరెన్స్​ క్లెయిమ్​లు తొందరగా పరిష్కారం చేసేందుకు త్వరలో నేషనల్​ హెల్త్​ క్లెయిమ్స్​ ఎక్స్చేంజీని తెస్తున్నట్లు ఇన్సూరెన్స్​ రెగ్యులేటరీ డెవలప్​మెంట్​ అథారిటీ (ఐఆర్​డీఏ) చైర్మన్ దేబాశిష్​ పాండా వెల్లడించారు. ఈ కొత్త ప్లాట్​ఫామ్​ను నేషనల్​ హెల్త్​ అథారిటీ (ఎన్​హెచ్​ఏ) తో కలిసి తేనున్నట్లు చెప్పారు. ఇన్సూరెన్స్​ కంపెనీలను ఈ ప్లాట్​ఫామ్​కి తెచ్చే పనులు ప్రస్తుతం సాగుతున్నాయని పేర్కొన్నారు. కొత్త ప్లాట్​ఫామ్​ వల్ల హెల్త్​ఇన్సూరెన్స్​ క్లెయిమ్స్​ పరిష్కారం సాఫీగా, వేగంగా జరగడానికి అవకాశం కలుగుతుందన్నారు. లైఫ్​, జనరల్​ ఇన్సూరెన్స్​ కౌన్సిల్స్​ కూడా ఈ ప్రాజెక్టులో భాగం పంచుకుంటున్నట్లు తెలిపారు.

ALSO READ:ఉస్మానియా ఆస్పత్రిలో రోగులు ఉక్కిరిబిక్కిరి.. డాక్టర్లు తీవ్ర ఇబ్బందులు 

ఆయుష్మాన్​ భారత్​ డిజిటల్​ మిషన్​ (ఏబీడీఎం) కింద నేషనల్​ హెల్త్​క్లెయిమ్స్​ ఎక్స్చేంజీ ఏర్పాటును సెప్టెంబర్​ 2022 లోనే ప్రకటించారు. సీనియర్​ సిటిజెన్స్​కు హెల్త్​ ఇన్సూరెన్స్​ రెన్యువల్​ ప్రీమియం భారీగా పెరగడాన్ని ప్రస్తావిస్తూ, అందరు స్టేక్​హోల్డర్లు కలిసి ఈ ప్రీమియం తగ్గేలా ప్రయత్నించాలని పిలుపు ఇచ్చారు. గత మూడేళ్లలో దేశంలో ఆరు కోట్ల క్లెయిమ్స్​కు మొత్తం రూ. 1.83 లక్షల కోట్లను ఇన్సూరెన్స్​ కంపెనీలు చెల్లించినట్లు దేబాశిష్​ పాండా వెల్లడించారు. 2022–23 లోనే 2.4 కోట్ల క్లెయిమ్స్​ కింద రూ. 70 వేల కోట్లను సెటిల్​ చేసినట్లు తెలిపారు.