
- సమీక్షా సమావేశాలకు వినియోగించుకోనున్న సీఎం
- సెక్రటేరియెట్లోని ముఖ్యమంత్రి చాంబర్లోనూ మార్పులు
హైదరాబాద్, వెలుగు: పోలీస్ కమాండ్ కంట్రోల్సెంటర్ను క్యాంప్ ఆఫీస్లాగా వాడుకునేందుకు సీఎం రేవంత్రెడ్డి నిర్ణయించారు. రెగ్యులర్ రివ్యూలకు దీన్ని వినియోగించుకోనున్నారు. క్యాంప్ఆఫీస్ లేకపోవడంతో ఇప్పటికే అన్ని సౌకర్యాలతో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సీఎం చాంబర్ ను సమీక్ష సమావేశాల కోసం వాడుకుంటున్నారు. ఇక డాక్టర్ బీఆర్అంబేద్కర్సెక్రటేరియెట్ఆరో ఫ్లోర్లోని సీఎం చాంబర్లోనూ మార్పులు చేస్తున్నారు.
ఈ చాంబర్విశాలంగా ఉండడంతో మంత్రు లు, అధికారులు, వీఐపీలు కూర్చోడానికి ఇబ్బందికరంగా ఉంది. దీంతో అందులో పార్టిషన్లు చేస్తున్నారు. అందులో భాగంగానే సీఎం సెక్రటేరియెట్ కు రావడం లేదని తెలుస్తోంది. అలాగే, ప్రధాన ద్వారం ఈస్ట్ గేట్ నుంచి కాకుండా సౌత్ ఈస్ట్ నుంచి లేదా వెన క వైపు వెస్ట్ సైడ్ గేట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ ఎంట్రీకి ఏర్పాట్లు చేస్తున్నారు.