కొండగట్టులో పవిత్రోత్సవాలు ప్రారంభం

కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న సన్నిధిలో గురువారం పవిత్రోత్సవాలు ప్రారంభించినట్లు ఏఈవో అంజయ్య, ప్రధాన అర్చకుడు జితేంద్రప్రసాద్ తెలిపారు. మూడు రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో గురువారం ఉత్సవమూర్తులకు పవిత్ర ఆహ్వానం, పంచామృత అభిషేకం, ప్రత్యేక అలంకరణ చేపట్టారు. కార్యక్రమంలో ఉప ప్రధాన అర్చకుడు చిరంజీవి, స్థానాచార్యుడు కపిందర్, సూపరింటెండెంట్​ శ్రీనివాస శర్మ, సునీల్ పాల్గొన్నారు.