ప్రజాపాలన ఎఫెక్ట్: అప్లికేషన్ ప్రింటవుట్​ @ 40.. లబోదిబో మంటున్న కామన్ పీపుల్

  • ప్రజాపాలన అప్లికేషన్లతో ధరలు పెంచిన జిరాక్స్ సెంటర్లు
  • జేబులకు చిల్లుపడుతుందటున్న  దరఖాస్తుదారులు
  • లబోదిబోమంటున్న కామన్​ పీపుల్

వరంగల్: ఇవ్వాల్టి నుంచి ప్రజాపాలన ప్రారంభం కావడంతో జిరాక్స్ సెంటర్లలో రద్దీ నెలకొంది. అప్లికేషన్​కు రేషన్​కార్డు, ఆధార్, గ్యాస్​బుక్, ఉపాధిహామీ జాబు కార్డుల జిరాక్స్ లను తప్పనిసరిగా జతపరచాలని ప్రభుత్వం పేర్కొనడంతో జిరాక్స్ ల వద్ద జనాలు క్యూ కడుతున్నారు.  దీంతో దొరికిందే చాన్స్​ అన్నట్టుగా జిరాక్స్​సెంటర్ల నిర్వాహకులు ధరలు పెంచారు.

Also read : నెల రోజుల వరకూ ప్రజాపాలన కౌంటర్లు : భట్టి విక్రమార్క

దీపం ఉన్నప్పడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఆలోచనతో భారీగా రుసుములను పెంచారు.  మామూలు రోజుల్లో ఒక్కో కాపీకి ఒక రూపాయి నుంచి రెండు రూపాయలు వసూలు చేస్తారు. అయితే ప్రజాపాలన కారణంగా గిరాకీ పెరగడంతో ఒక్కో కాపీకి రూ.30, రూ.40 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీంతో దరఖాస్తుదారులు లబోదిబోమంటున్నారు. జనవరి ఆరు వరకు సమయంతో ఉండడంతో అధికారులు చర్యలు తీసుకొని ధరలను నియంత్రించాలని కోరుతున్నారు.