ఉస్కమల్ల చిన్నపోచం స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

జైపూర్ (భీమారం) వెలుగు: భీమారం మండల కేంద్రంలో పోతనపల్లి గ్రామానికి చెందిన ఉస్కమల్ల చిన్నపోచం స్మారక క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ఆయన కుమారులు శ్రీనివాస్, పున్నం చందు, సాంబ శివ ప్రారంభించారు. క్రీడాకారులకు జెర్సీలను పంపిణీ చేశారు. విజేత జట్టుకు రూ.15 వేలు, రన్నరప్​కు రూ.10 వేలు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు పోడేటి రవి, లక్ష్మణ్, సత్తి రెడ్డి, దాసరి స్వామి, క్రీడా కారులు తదితరులు పాల్గొన్నారు.