బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర ప్రారంభం

బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర ప్రారంభం
  • గుట్టలకు కార్తీక శోభ

రేగొండ, వెలుగు: జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుగులోని వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను వంశీయ అర్చకులు కుర్మాచలం వెంకటేశ్వర్లు ఇంటి నుంచి రథంపై ఊరేగింపుగా గుట్టకు తరలించారు. ఉదయాన్నే గ్రామం నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహాలు మేళతాళాలతో బయలు దేరాయి. సాయంత్రానికి గుట్టకు చేరడంతో జాతర మొదటి రోజు వైభవంగా ప్రారంభమైంది. కార్తీక పౌర్ణమికి ముందే రోజే స్వామివారు కొండకు చేరడంతో భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. జాతర ఏర్పాట్లను ఈవో  బిల్లా శ్రీనివాస్​, జాతర చైర్మన్​ రొంటాల వెంకటస్వామి పర్యవేక్షిస్తున్నారు.