
మెదక్ టౌన్, వెలుగు: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన కామెంట్లు యావత్ హిందూ సమాజాన్ని కించపరచేలా ఉన్నాయని బీజేపీ మెదక్ జిల్లా ఇన్చార్జి డాక్టర్ ఎస్. మల్లారెడ్డి అన్నారు. సోమవారం బీజేపీ జిల్లా ఆఫీస్లో ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. హిందూ ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటివి అన్న ఉదయనిధి స్టాలిన్ ను వెంటనే బర్తరఫ్ చేయాలని, చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలయ్య, కరణం పరిణిత, జిల్లా ప్ర ధాన కార్యదర్శులు విజయ్, సుధాకర్ రెడ్డి, నాయకులు రామ్ చరణ్, రఘువీరారెడ్డి పాల్గొన్నారు.
ALSO READ: ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ శ్రినివాస్ రెడ్డి
సిద్దిపేట టౌన్ : సనాత ధర్మాన్ని కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా ఊరుకోబోమని బీజేపీ జిల్లా అ అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. సనాతన ధర్మంపై వివాదాస్పద కామెంట్లు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సోమవారం పట్టణంలోని పాత బస్టాండ్ సర్కిల్ వద్ద నిరసన తెలిపి స్టాలిన్ చిత్రపటాన్ని దగ్ధం చేశారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు పత్రి శ్రీనివాస్ యాదవ్, ఉపేందర్ రావు, లక్కిరెడ్డి తిరుమల, తొడుపునూరి వెంకటేశం, కొత్తపల్లి వేణుగోపాల్, నాగిరెడ్డి విజయ్పాల్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, శంకర్, వీరచారీ , వేణుగోపాల్, నరేశ్ యాదన్ రావు ,కృష్ణ, పద్మ, సుగుణ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.