Cyber Crime: భర్త, కొడుకును వదిలేసి.. ప్రియుడితో కలిసి రూ. 5కోట్లు కొట్టేసింది

Cyber Crime: భర్త, కొడుకును వదిలేసి.. ప్రియుడితో కలిసి రూ. 5కోట్లు కొట్టేసింది

Cyber Crime: కొన్ని ఆన్ లైన్ పరిచయాలు ఎలాంటి దుష్పరిణాలకు దారి తీస్తాయో ఈ సంఘటన ఉదాహరణ..పెళ్లి అయింది. భర్త, పిల్లలున్నారు.జల్సాలకు అల వాటు పడి భర్తను విడిచిపెట్టింది. బిడ్డను తల్లి దగ్గర వదిలేసింది. ఇన్ స్టా గ్రామ్ పరిచయం అయిన వ్యక్తితో జీవనం మొదలు పెట్టింది. అతడో మోసాగాడు.. అతనితో నేరాలకు పాల్పడింది. చివరికి జైలు పాలైంది. 

బీహార్ కు  చెందిన  ఇషా  కామర్స్ గ్రాడ్యుయేట్. సోషల్ మీడియాలో  పరిచయమైన వ్యక్తితో కలిసి సైబర్ నేరానికి పాల్పడి జైల్లో ఊచలు లెక్కబెడుతోంది. పెళ్లై భర్త, ఒకటిన్నరేళ్ళ పాప ఉంది.. వారితో చక్కగా జీవితం గడపాల్సిన ఇషాకు ..అవేమీ నచ్చలేదు.. జల్సాలకు అలవాటు పడిన ఇషా రీల్స్ పిచ్చి ఉంది. దీంతో  ఇన్ స్టాగ్రా మ్ లో ఆమె రీల్స్ చూసి పరిచయమైన ఫ్రెండ్.. సైబర్ నేరగాడు ముస్తాక్ ఆలంతో సహజీవనం మొదలపెట్టింది. అతడి నేరాల్లో పాల్పంచుకుంది. సైబర్ నేరాలతో రూ. 5 కోట్లు కొట్టేసింది. 

ఇషా జైష్వాల్ బీహార్ లోని మోతిహారి నివాసి.. బీకాం గ్రాడ్యుయేట్ అయిన ఇషా 2020లో పెళ్లి చేసుకుంది. భర్త, కూతురు ఉన్నారు. భర్తను విడిచిపెట్టి పుట్టింటికి వచ్చింది. బిడ్డను తల్లి దగ్గర వదిలేసి ఢిల్లీకి మకాం మార్చింది. అక్కడి ముస్తాక్ ఆలంలో సహజీవనం చేస్తూ.. మోసాలు చేయడం ప్రారంభించింది.వీరు జమతారా నుంచి భోపాల్, ముంబై వరకు సైబర్ మోసాలకు పాల్పడేవారని చెబుతున్నారు. చివరికి పోలీసులకు చిక్కారు. 

ఇలా మోసం చేసేవారు

ఏటీఎం మెషీన్‌కు వచ్చిన వ్యక్తుల కార్డులను మార్చడంలో ఇషా నిపుణురాలు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి డబ్బును తారుమారు చేసేవారు. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఇషా, నెస్తాక్ (ముస్తాక్) ఏడాదికి పైగా సహజీవనం చేస్తున్నారు. ఈ సమయంలో ముస్తాక్ ఇషాను ATM మోసాల్లో శిక్షణ ఇచ్చాడు. ఇషా ఏటీఎం క్యూలో నిలబడి, సహాయం చేస్తాననే నెపంతో కస్టమర్ల ఏటీఎం కార్డులను మార్చి, ఆ తర్వాత ఒరిజినల్ కార్డుతో లావాదేవీలు నిర్వహించేది. ఆమె అవసరమైనప్పుడు ఫోన్ చేసి ఏదో ఒక సాకుతో ప్రజలను మోసం చేసేవారు. 

బీహార్‌లోని చంపారన్ జిల్లాలోని జౌకాటియా, లాల్ సారయ్య, రామ్‌నగర్ బంకాట్ వంటి కొన్ని పంచాయతీలు దర్యాప్తు సంస్థల రాడార్‌లో ఉన్నాయి. ఈ ప్రాంతాల యువత సైబర్ క్రైమ్‌లలో ప్రమేయం ఉన్నందుకు పోలీసులకు సమాచారం ఉండటంతో ఈడీ, IT , NIA ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల దాడులు చేశాయి. సైబర్ మోసాలకు పాల్పడుతున్న చాలా మందిని జౌకాటియా నుండే అరెస్టు చేశారు. బెట్టియా పోలీసు వర్గాల సమాచారం ప్రకారం..జౌకతీయ నుండి 50 మందికి పైగా యువకులను అరెస్టు చేశారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దాదాపు 700 నుంచి 1000 మంది యువకులు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. 24 ఏళ్ల ముస్తాక్ జౌకాటియా పురాణ తోలా నివాసి. నాలుగు సంవత్సరాల క్రితం, ఛతీ ఫెయిల్ ఆలం బెట్టయ్యలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండగా..అతని గ్రామంలో సైబర్ నేరగాళ్లతో పరిచయం ఏర్పడింది. వాటి ద్వారా పాకిస్థాన్ నెట్‌వర్క్‌లతో పరిచయం పెంచుకుని నేరాలు పాల్పడుతున్నాడు. 

గడిచిన 5 నెలల్లో అతను CDM (క్యాష్ డిపాజిట్ మెషిన్) , హవాలా ద్వారా పాకిస్తాన్ సైబర్ నేరగాళ్లకు ఇప్పటివరకు దాదాపు 5 కోట్ల రూపాయలను పంపాడు. వారి నుంచి 16 ఏటీఎం కార్డులు, 6 మొబైల్స్, 6 సిమ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జమతారా నుంచి భోపాల్, ముంబై వరకు సైబర్ మోసాలకు పాల్పడేవారని చెబుతున్నారు. చివరికి ఇషా, ఇస్తాక్ పోలీసులకు చిక్కి జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు.