కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర రూ. 48 పెంపు

కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర రూ. 48 పెంపు

న్యూఢిల్లీ : కమర్షియల్​ ఎల్పీజీ రేటు పెరిగింది. అంతర్జాతీయ చమురు ధరల ట్రెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు అనుగుణంగా 19 కిలోల సిలిండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర రూ. 48.50 పెరిగింది. హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే ఈ 19 కిలోల సిలిండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ. 1,740లకు పెరిగింది. గత మూడు నెలలుగా దీని ధర పెరుగుతూనే ఉంది. ఆగస్టులో రూ.6.5, సెప్టెంబర్​లో రూ.39 చొప్పున ధరలు పెరిగాయి.     

ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్,  హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్  విదేశీ సగటు ధర ఆధారంగా ప్రతి నెల మొదటి తేదీన ఏటీఎఫ్,​  వంట గ్యాస్ ధరలను మారుస్తాయి. 

అయితే విమానాల్లో వాడే జెట్ ఇంధనం లేదా ఏటీఎఫ్​ ధర 6.3 శాతం తగ్గి ఈ ఏడాది కనిష్ట స్థాయికి చేరుకుంది.  ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్​) ధర కిలోలీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ. 5,883 తగ్గి, దేశ రాజధానిలో రూ. 87,597.22కి పడిపోయింది.