న్యూఢిల్లీ: హోటళ్లు రెస్టారెంట్లలో ఉపయోగించే కమర్షియల్ ఎల్పీజీ ధర రూ. 62 పెరిగింది. 19 కిలోల సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ.1,802లకు చేరింది. సాధారణ సిలిండర్ ధర మారలేదు. విమానాల్లో వాడే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్) ధర కిలోలీటర్‌కు రూ. 2,941.5 పెరిగి దేశ రాజధానిలో కిలోలీటర్‌కు రూ. 90,538.72కి చేరుకుంది.
ఈ ఏడాది కనిష్ట స్థాయికి రేట్లను తీసుకెళ్లిన రెండు రౌండ్ల తగ్గింపు తర్వాత పెంపు జరిగింది. అక్టోబర్ 1న ఏటీఎఫ్ ధర 6.3 శాతం, సెప్టెంబర్ ఒకటిన 4.58 శాతం తగ్గింది. ముంబైలో ఏటీఎఫ్ రేటు గతంలో రూ.81,866.13 నుంచి శుక్రవారం రూ.84,642.91కి కిలోలీటరుకు పెరిగింది.