LPG cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

  •  19 కేజీల సిలిండర్ పై రూ. 16.50 వడ్డన
  • డిసెంబర్ 1 నుంచే అమల్లోకి
     

న్యూఢిల్లీ: వంటగ్యాస్ వినియోగదారులపై కేంద్రం మరోసారి భారం మోపింది. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 16.50 పెంచింది. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు ఇంధన కంపెనీలు ప్రకటన విడుదల చేశాయి. 

Also Read : అక్రమాల అధికారిని చంచల్​గూడజైల్లో పెట్టారు

ఆగస్టు నుంచి ఇప్పటివరకు ఐదుసార్లు గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. కాగా తాజాగా పెంచిన ధరతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1818గా ఉంది. డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.