పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర : 19 కేజీలు 18 వందల రూపాయలు

పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర : 19 కేజీలు 18 వందల రూపాయలు

 దేశ వ్యాప్తంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ సిలిండర్ ధరలను స్వల్పంగా పెంచాయి. 19 కేజీల కమర్షియల సిలిండర్ ధరను రూ.6 పెంచాయి. పెరిగిన ధరలతో ఢిల్లీలో  కమర్షియల్ సిలిండర్ ధర రూ.1797 నుంచి 1803కి చేరింది. 

పెరిగిన రేట్లతో  కోల్ కతాలో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ. 1913కి చేరింది. ముంబైలో 1755, హైదరాబాద్‌లో 19 కిలోల 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర సుమారు రూ. 2, 023గా ఉంది.

అయితే  2024 ఆగస్టు నుంచి14.2 కిలోల  LPG సిలిండర్ల రేటు  మారలేదు.  ఎల్‌పిజి సిలిండర్ ధర ఢిల్లీలో రూ.803, కోల్‌కతాలో రూ.829, ముంబైలో రూ.802, చెన్నైలో రూ.818గా ఉంది. హైదరాబాద్ లో రూ. 855గా ఉంది.

ప్రతి నెల గ్యాస్ సిలిండర్ ధరల సవరింపు ఉంటుందని గతంలో ప్రకటించిన కంపెనీలు.. ఆగస్టు 2024  నుంచి ధరలు పెంచుతూ వస్తున్నాయి. జనవరి 2025 న ప్రతి 19 కేజీల ఎల్పీజీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై14.5 రూపాయలు తగ్గించి మళ్లీ మార్చి 1న రూ.6 పెంచాయి.