మాజీ సీఎస్​ సోమేశ్​కు .. బిగుస్తున్న ఉచ్చు

మాజీ సీఎస్​ సోమేశ్​కు .. బిగుస్తున్న ఉచ్చు
  • రూ. 1,400 కోట్ల జీఎస్టీ స్కామ్​లో ఆయనదే కీలక పాత్ర!.. కేసు సీఐడీకి బదిలీ
  • 75 కంపెనీలకు, రాష్ట్ర బెవరేజెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్​కు లబ్ధి చేకూర్చేలా గోల్​మాల్​
  • నాడు వాట్సాప్​ గ్రూప్​ ద్వారా కథ నడిపించిన సోమేశ్​
  • ఎప్పటికప్పుడు సర్వీస్​ ట్యాక్స్​ అధికారులకు ఆదేశాలు
  • కీలకంగా మారిన ఫోరెన్సిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్ , వాట్సాప్​ గ్రూప్​
  • సీఐడీ ఎంట్రీతో మరింత లోతుగా విచారణ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: జీఎస్టీ కుంభకోణంలో మాజీ చీఫ్​ సెక్రటరీ సోమేశ్​కుమార్​కు ఉచ్చు బిగుస్తున్నది. రూ. 1,400 కోట్ల ఈ స్కామ్​లో పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇప్పటికే సోమేశ్​పై హైదరాబాద్​ సీసీఎస్​ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐదో నిందితుడిగా చేర్చారు. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకొని సీసీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి సీఐడీకి కేసును బదిలీ చేస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 ఈ మేరకు సీసీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నమోదైన ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఆర్ సహా జీఎస్టీ అధికారులు అందించిన డాక్యుమెంట్లను సీఐడీకి అప్పగించాల్సిందిగా ఆదేశించింది. ఈ స్కామ్​లో ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీకి చెందిన కంపెనీలు రూ.1,400 కోట్లకు పైగా జీఎస్టీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రెడిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్సిడీ పొందినట్లుగుర్తించింది. ఈ మేరకు సీఐడీ ద్వారా సమగ్ర దర్యాప్తు జరిపించేలా చర్యలు తీసుకుంది. 

వాట్సాప్​ గ్రూప్​ వేదికగా దందా

కంపెనీలకు ట్యాక్స్​ నుంచి తప్పించి లబ్ధిపొందేందుకు సోమేశ్​ ఆధ్వర్యంలో ‘స్పెషల్ ఇన్సియేటివ్స్’ పేరిట వాట్సాప్​ గ్రూప్​ నడిచినట్లు పోలీసులు గుర్తించారు.సహ నిందితులైన సర్వీస్ ట్యాక్స్ అధికారులు విశ్వేశ్వరరావు, శివరామప్రసాద్‌‌ , శోభన్‌‌ బాబుకు ఎప్పటికప్పుడు ఈ వాట్సాప్​ గ్రూప్​ ద్వారా నాడు సోమేశ్​ ఆదేశాలు ఇచ్చినట్లు ఆధారాలు సేకరించారు. ఇందుకు సంబంధించిన వాట్సాప్‌‌  చాటింగ్స్‌‌  సహా మొత్తం 35 రకాల డాక్యుమెంట్లను ఇప్పటికే కోర్టుకు పోలీసులు సమర్పించారు. 

ఆయన వెనుక ఎవరున్నారు?

గత బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో సీఎస్‌‌ గా పనిచేసిన సోమేశ్​కుమార్​ వెనుక ఎవరున్నారు అనే కోణంలో  దర్యాప్తు  సాగుతున్నది. నాడు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండానే ఈ కుంభకోణానికి తెరతీశారా? లేక నాటి ప్రభుత్వంలోని పెద్దల హస్తం ఏమైనా ఉన్నదా అనేదానిపై విచారణ నడుస్తున్నది. జీఎస్టీ అధికారులు అందించిన ఆడిట్ రిపోర్ట్స్‌‌  ఆధారంగా ఎంక్వైరీ సాగుతున్నది.ఈ భారీ కుంభకోణంలో సోమేశ్​ కీలకంగా వ్యవహరించినట్లు సీసీఎస్​ పోలీసులు గుర్తించారు. 

నోటీసులివ్వనున్న సీఐడీ

కేసును  సీఐడీకి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో.. సీసీఎస్ పోలీసుల నుంచి  సీఐడీకి మంగళవారం కేసు డాక్యుమెంట్లు చేరే అవకాశాలు ఉన్నాయి. జీఎస్టీ అధికారులు అందించిన ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్‌‌  ఆధారంగా సీసీఎస్ పోలీసులు ఇప్పటికే ప్రాథమిక వివరాలు సేకరించారు. సీసీఎస్‌‌  నుంచి వచ్చిన ఎఫ్‌‌ ఐఆర్‌‌ ‌‌  ఆధారంగా సీఐడీ మరోకేసు నమోదు చేస్తుంది. ఇందులో భాగంగా మాజీ సీఎస్‌‌  సోమేశ్​కుమార్‌‌ ‌‌  సహా నిందితులైన సర్వీస్‌‌  ట్యాక్స్‌‌  అడిషనల్‌‌  కమిషనర్‌‌ ‌‌  ఎస్‌‌ వీ కాశీవిశ్వేశ్వర రావు, డిప్యూటీ కమిషన్‌‌  ఎ.శివరామప్రసాద్‌‌ , అసిస్టెంట్‌‌  ప్రొఫెసర్‌‌ ‌‌  శోభన్‌‌ బాబు, ప్లియాంటో టెక్నాలజీస్‌‌  కంపెనీ నిర్వాహకులకు నోటీసులు అందించే అవకాశం ఉంది. 

కుంభకోణం రూ. 1,400 కోట్లకు పైనే..!

కమర్షియల్‌‌  ట్యాక్స్‌‌  సెంట్రల్ కంప్యూటర్‌‌ ‌‌  వింగ్‌‌  జాయింట్ డైరెక్టర్‌‌ ‌‌  రవి కనూరి ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్స్‌‌  ఆధారంగా దర్యాప్తు నడుస్తు న్నది.  ఇన్‌‌ పుట్‌‌  ట్యాక్స్‌‌  క్రెడిట్‌‌  చెల్లింపుల్లో రాష్ట్ర బెవరేజెస్‌‌  కార్పొరేషన్‌‌  సహా 75 కంపెనీ లకు లబ్ధి చేకూర్చేలా స్కామ్​ నడిచినట్లు ఇప్పటికే ఫోరెన్సిక్‌‌  ఆడిట్‌‌  రిపోర్ట్​లో వెల్లడైం ది. ఇట్లా ప్రభుత్వ ఖజానాకు రూ.1,400 కోట్ల కు పైగా నష్టం వాటిల్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో రాష్ట్ర బెవరేజెస్‌‌  కార్పొ రేషన్‌‌   రూ.400 కోట్లు, 75 కంపెనీలు రూ.వెయ్యి కోట్లకుపైగా ట్యాక్స్​ ఎగవేసినట్లు డాక్యుమెంట్లు సేకరించారు. ఈ కంపెనీల్లో ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీకి చెందినవి ఉన్నాయి. ట్యాక్స్​ ఎగవేతలో కంపెనీలకు సహకరించి సోమేశ్,​ ఇతర నిందితులు భారీ ప్రయోజనం పొందినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.