
- వానాకాలం రూ.5.79కోట్లు, యాసంగి రూ.3.22 కోట్లు పెండింగ్
- ఏడాదైనా రిలీజ్‌కాని ఫండ్స్
- ఈ సీజన్లో స్టార్ట్కానున్న కొనుగోలు సెంటర్లు
- కమీషన్ రాకపోతే సెంటర్లు నిర్వహణ కష్టమంటున్న నిర్వాహకులు
మహబూబాబాద్, వెలుగు: గతేడాది కొనుగోలు సెంటర్లలో కొన్న వడ్లకు సంబంధించి కమీషన్ పైసలు ఇంకా రాలేదు. జిల్లాలో రైతులు పండించిన వరిని కొనేందుకు గతేడాది ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా, గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొనుగోలు సెంటర్లను ఏర్పాటుచేయించింది. వీటి ద్వారా రైతుల నుంచి వడ్లు కొన్నారు. అయితే కొనుగోలు కమీషన్ ఇంకా అందకపోవడంతో ఈసారి సెంటర్లు ఎలా నిర్వహించాలని నిర్వాహకులు వాపోతున్నారు. కమీషన్వస్తేనే సెంటర్లలో రైతులకు అవసరమైన సౌలత్లు కల్పించే అవకాశం ఉంటుందంటున్నారు.
రూ.కోట్లలో కమీషన్ పైసలు పెండింగ్
వడ్ల కొనుగోలుకు సంబంధించి సెంటర్ల నిర్వాహకులకు రూ.కోట్లలో కమీషన్డబ్బులు రావాల్సి ఉంది. మహబూబాబాద్ జిల్లాలో 2021–22 వానాకాలం సీజన్లో 234, యాసంగిలో 185 కొనుగోలు సెంటర్లలో వడ్లు కొన్నారు. కమీషన్‌రూపంలో వానాకాలానికి రూ.5.79కోట్లు, యాసంగికి రూ.3.22 కోట్లు రావాల్సి ఉంది. కమీషన్పైసలు సకాలంలో అందకపోవడంతో నిర్వహకులకు ఇబ్బందిగా మారింది. కమీషన్క్వింటాల్కు ఏ గ్రేడ్ వడ్లకు రూ. 32 , బీ గ్రేడ్‌కు రూ.31.25 ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కమీషన్ద్వారానే సెంటర్లలో బస్తాల ప్యాకింగ్‌కు సుతిలి, తాగునీరు, నీడ కోసం టెంట్లు, టార్పాలిన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సివిల్సప్లై డిపార్ట్‌మెంట్‌నుంచి కేవలం గన్నీ బ్యాగులు, కాంటాలు అందుతాయి. కొన్న వడ్లు తడిసినా ఆ నష్టాన్ని నిర్వాహకులే భరించాల్సి ఉంటుంది.
కమీషన్ పైసలు వెంటనే మంజూరు చేయాలి
ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా వడ్లు కొన్నప్పటికీ తమకు కమీషన్ఇంకా రాలేదు. ఆ పైసలు వెంటనే మంజూరు చేయాలి. ఒక సీజన్లో కొన్న వడ్లకు సంబంధించిన కమీషన్ మరో ఏడాది ఇస్తుండటంతో సెంటర్ల నిర్వహణ కష్టంగా ఉంది. ఏ సీజన్‌కు కమీషన్పైసలు అదే సీజన్లో ఇవ్వాలి. తక్షణమే ఆఫీసర్లు స్పందించి పెండింగ్కమీషన్పైసలు వెంటనే అందించాలి.
- ఒర సైదమ్మ, సెంటర్నిర్వహకురాలు, గుండెపూడి, మరిపెడ మండలం
నిధులు మంజూరు కాగానే అందజేస్తాం
ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే వడ్ల కమీషన్డబ్బులు వెంటనే అందిస్తాం. గతేడాది వానాకాలం, యాసంగి సీజన్ల కమీషన్డబ్బులు రావాల్సి ఉంది. వడ్ల కమీషన్ తోపాటు, హమాలీ ఛార్జీలు వచ్చేలా కృషి చేస్తున్నాం..
-కృష్ణవేణి, మేనేజర్, సివిల్ సప్లై, మహబూబాబాద్
మెయింటనెన్స్ కు ఇబ్బంది అవుతోంది
ప్రతి సీజన్లో కొనుగోలు సెంటర్లు నిర్వహిస్తున్నా కమీషన్డబ్బులు ఆలస్యమవుతుండటంతో మెయింటనెన్స్‌కు ఇబ్బంది కలుగుతోంది. ఏ సీజన్లో కొనుగోలు కమీషన్పైసలు ఆ సీజన్లోనే అందిస్తే సెంటర్లో సౌలత్లు కల్పించే అవకాశం ఉంటుంది. మాకూ ప్రోత్సాహకంగా ఉంటుంది. కమీషన్డబ్బులు రాక మా సమాఖ్య డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. కొన్నిసార్లు అప్పులు చేయాల్సి వస్తోంది.
- బుజ్జి, కొనుగోలు సెంటర్ నిర్వాహకురాలు తండ ధర్మారం, మరిపెడ మండలం