ఇంటి పన్ను వసూళ్లలో వేగం పెంచాలి : ఆదర్శ్ సురభి

ఖమ్మం టౌన్, వెలుగు: ఇంటి పన్ను వడ్డీ రాయితీకి నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఇంటి పన్ను వసూళ్లలో వేగం పెంచాలని ప్రతీ బిల్ కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్లకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదర్శ్ సురభి సూచించారు. బుధవారం శ్రీనివాస్ నగర్, ముస్తఫా నగర్ లో కమిషనర్ స్వయంగా ఇండ్ల వద్దకు వెళ్లి ఇంటి పన్ను చెల్లించాలని సూచించారు.

లాస్ట్ ఇయర్ ఇంటి పన్ను చెల్లించని ఇండ్లకు పంపు కనెక్షన్ తొలగించాలని కమిషనర్, బిల్ కలెక్టర్లను ఆయన ఆదేశించారు.  అనంతరం ఖమ్మం నగరంలోని కొత్తూరు, శాంతినగర్ స్కూళ్లలోని పోలింగ్ కేంద్రాలను ఆయన తనిఖీ చేసి అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.