సీజనల్ వ్యాధులపై కో ఆర్డినేషన్ తో ముందుకెళ్లాలి

  • బల్దియా కమిషనర్ ఆమ్రపాలి

హైదరాబాద్, వెలుగు : జీహెచ్ఎంసీ పరిధిలో సీజనల్ వ్యాధుల నివారణపై డీఎంహెచ్ వోలను కో ఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకెళ్లాలని కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు. శుక్రవారం అడిషనల్, జోనల్ కమిషనర్ లతో ఆమె టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు.  సీజనల్ వ్యాధులపై ప్రతి వారం కో ఆర్డినేషన్ మీటింగ్  ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 

శానిటేషన్ నిర్వహణలో రాంకీ వాహనాలు సమయానికి వెళ్లి చెత్త తీసుకెళ్లేలా జీపీఎస్ సిస్టమ్ ద్వారా పరిశీలన చేయాలని తెలిపారు. సిబ్బంది హాజరు 3 దశల్లో  కాకుండా.. ఎస్ ఎఫ్ఏ టైమ్ కు  ఎఫ్ఆర్ఎస్ ద్వారా అటెండెన్స్ తీసుకునే పాయింట్లపై కార్మికులకు తెలపాలని కమిషనర్ స్పష్టంచేశారు.