గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అడ్వర్టైజింగ్ పోస్టులు, యాడ్స్ పై జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి గోడలపై అనుమతి లేకుండా పోస్టర్లు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఆమ్రపాలి హెచ్చరించారు. GHMC పరిధిలో వాల్ పోస్టర్లను శుక్రవారం నుంచి పూర్తిగా బ్యాన్ చేశారు. పర్మిషన్ లేకుండా పోస్టర్లు అంటిస్తే జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. గోడలపై సినిమా పోస్టర్లు, వాల్ రైటింగ్స్ నిషేధిస్తున్నట్లు ఆమ్రపాలి తెలిపారు. సినిమా పోస్టర్లు, వ్యాపార ప్రకటనలకు సంబంధించిన పోస్టర్లు అనుమతి లేకుండా వేయడాన్ని నిషేధించారు. సినిమా పోస్టర్లు కూడా అంటించి రాదని నిబంధనలు జారీ చేశారు. ఈ మేరకు త్వరలో లోకల్ ప్రింటర్స్ తో మాట్లాడి డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు పంపనున్నారు.
ALSO READ | World Tourism Day 2024 : తెలంగాణ 33 జిల్లాల్లోని పర్యాటక ప్రదేశాలు