వరంగల్సిటీ, వెలుగు : పార్కుల్లో పునరుద్ధరణ పనులు చేపట్టాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఉద్యానవన అధికారులను ఆదేశించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో హార్టికల్చర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగర వ్యాప్తంగా ఉన్న 27 పార్కుల్లో దెబ్బతిన్న నిర్మాణాలను ఉద్యానవన, ఇంజినీరింగ్ విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పునరుద్ధరించాలని అన్నారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారులు రమేశ్, లక్ష్మారెడ్డితోపాటు ఈఈ మహేందర్, హార్టికల్చర్ అసిస్టెంట్లు ప్రిన్సి, అశ్విని, అనూహ, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
సమర్థవంతంగా శానిటేషన్ నిర్వహణ జరగాలి
సమర్థవంతంగా శానిటేషన్ నిర్వహణ జరగాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో శానిటేషన్ విభాగ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ నగర పరిధిలోని 6వ డివిజన్ ను మోడల్ శానిటేషన్ డివిజన్ గా ఎంపిక చేశామని, ఇక్కడ సమగ్ర శానిటేషన్ నిర్వహణ చేపట్టడానికి 100 శాతం చెత్త సేకరణ జరగాలని చెప్పారు.