హైదరాబాద్: సీపీ సీవీ ఆనంద్ క్షమాపణలు చెప్పారు. నేషనల్ మీడియాను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ట్విట్టర్ లో పోస్టు పెట్టారు. సంధ్య థియేటర్ ఘటనపై జాతీయ మీడియా ప్రశ్నలు అడిగినప్పుడు తాను సహనాన్ని కోల్పోయినట్లు తెలిపారు. సంధ్య థియేటర్ వద్ద అసలేం జరిగిందో తెలుపుతూ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నిన్న ప్రెస్‌మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. థియేటర్‌లో ఆరోజు ఏం జరిగిందో తెలుపుతూ కొన్ని వీడియోలను విడుదల చేశారు.
ALSO READ : అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో నిందితులకు బెయిల్
ఈ క్రమంలో మీడియా ఆయనను కొన్ని విషయాలపై ప్రశ్నించగా.. నేషనల్ మీడియా ఈ ఘటనకు మద్దతు ఇస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడ ఉన్న కొందరు జర్నలిస్టులు ఈ ఆరోపణలను తప్పుపట్టారు. తాజాగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు సీవీ ఆనంద్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, ప్రెస్‌మీట్‌లో రెచ్చగొట్టే ప్రశ్నలు వేయడంతో నేను కాస్త సహనాన్ని కోల్పోయానని అన్నారు.
— CV Anand IPS (@CVAnandIPS) December 22, 2024