- లా అండ్ ఆర్డర్‌ను కాపాడుతామని ప్రకటన
- పోలీస్ కమిషనర్‌గా బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో సమగ్ర దర్యాప్తు జరుపుతామని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. కేసు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సిటీలో లా అండ్ ఆర్డర్ పరిరక్షణ.. డ్రగ్స్, గంజాయి నియంత్రణ కోసం కృషి చేస్తామని చెప్పారు.
కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లోని తన ఆఫీసులో సోమవారం రెండోసారి సీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. తనకు మళ్లీ అవకాశం ఇచ్చినందుకు సీఎం రేవంత్‌కు సీవీ ఆనంద్ ధన్యవాదాలు తెలిపారు.