
హైదరాబాద్ సిటీ, వెలుగు: స్వచ్ఛ సర్వేక్షన్ టీమ్సోమవారం నుంచి సిటీలో పర్యటించనున్నట్లు కమిషనర్ ఇలంబరితి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల మూడో వారం వరకు పర్యటన కొనసాగుతుందన్నారు. నివాస, వాణిజ్య ప్రాంతాలు, బల్క్ చెత్త జనరేటర్ల జాబితా, పబ్లిక్ టాయిలెట్ల స్థానాలు, మూత్రశాలలు, ఉద్యానవనాలు, తోటలు, నీటి వనరులు, పర్యాటక ప్రదేశాలు, విద్యా సంస్థలు, స్ట్రామ్ వాటర్ డ్రెయిన్లు, నల్లాలు, ఆర్ఆర్ఆర్ కేంద్రాలు, సీ అండ్ డీ వ్యర్థాలు,- సెకండరీ కలెక్షన్ పాయింట్లకి సంబంధించి లాగ్ పుస్తకాలు సిద్ధంగా ఉంచాలని మెకికల్ ఆఫీసర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను ఆదేశించారు.