
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జరుగుతున్న అభివృద్ధి పనులను గురువారం GHMC కమిషనర్ పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న SRDP ప్రాజెక్టులు, నిర్మాణ పనులను ఆయన హెచ్ఎండిఎ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ తో కలిసి సందర్శించారు. ఫలక్ నుమా ఆర్ఓబి, నల్గొండ x రోడ్ ఫ్లై ఓవర్, ఉప్పల్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల పరిశీలించారు. ఫలక్ నుమా ఆర్ ఓ బి రైల్వే శాఖ చేపట్టాల్సిన పనులను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నల్గొండ x రోడ్డు ఫ్లై ఓవర్, ఉప్పల్ ఫ్లై ఓవర్ భూసేకరణ పెండింగ్ లో ఉన్నట్లు ప్రాజెక్టు ఇంజనీరింగ్ సిఈ దేవానంద్ కమిషనర్ కు వివరించడంతో భూసేకరణ పనుల వెంటనే పూర్తి చేయాలని GHMC కమిషనర్ ఆదేశించారు.