గోదావరిఖని, వెలుగు : రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అన్ని ఏరియాల్లో స్ట్రీట్‌లైట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అడిషనల్ కలెక్టర్, కమిషనర్(ఎఫ్ఏసీ) జె.అరుణశ్రీ తెలిపారు. శుక్రవారం బల్దియా ఆఫీస్‌లో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్పొరేషన్ నిధులు రూ.33.90 లక్షలతో లైట్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు.
మొత్తం 1,300 కొత్త స్ట్రీట్ లైట్లను మరో 30 రోజుల్లోపు అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కార్పొరేషన్ పరిధిలో కొత్తగా 1,219 కొత్త విద్యుత్ పోల్ అవసరమని అంచనా వేయగా 677 పోల్‌లు వేసినట్లు చెప్పారు. ఆస్తి పన్ను చెల్లింపుదారులు బకాయలతో సహా సకాలంలో పన్నులు చెల్లించి కార్పొరేషన్‌కు సహకరించాలని ఈ సందర్భంగా కమిషనర్ కోరారు. అనంతరం బల్దియా పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ వెంట కార్పొరేటర్ కన్నూరి సతీశ్‌కుమార్, ఆఫీసర్లు రాజు, శివానంద్, రామన్, జమీల్, మీర్, సునీల్ రాథోడ్, తదితరులున్నారు.